Odisha Train Incident : ధ్వంసమైన భోగీలు భయానక దృశ్యాలు
ఒడిశా రైలు దుర్ఘటనలో హాహాకారాలు
Odisha Train Incident : ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో చోటు చేసుకున్న కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొన్న దుర్ఘటనలో(Odisha Train Incident) 288 మందికి పైగా చని పోగా 900 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. దేశ చరిత్రలో ఇది మహా విషాదం. ఇక ప్రమాద స్థలంలో మృత దేహాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. భోగీలు ధ్వంసమయ్యాయి. రక్తంతో రంధ్రాలు తడిసి పోయాయి. ఎక్కడ చూసినా భయానక దృశ్యాలు అగుపిస్తున్నాయి. ఆ ప్రాంతమంతా బాధితుల హాహాకారాలు, మృతుల కుటుంబీకుల ఆక్రందనలతో నిండి పోయాయి. ఈ ఘటనలో క్యారేజీలు పూర్తిగా బోల్తా పడ్డాయి.
20 ఏళ్లలో దేశంలోనే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదం అని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో క్యారేజీలు పూర్తిగా పల్టీలు కొట్టాయి. రెస్క్యూ సిబ్బంది విరిగి పోయిన శిథిలాలలో చిక్కుకున్న వారి కోసం వెతికారు. ట్రాక్ ల పక్కన తెల్లటి షీట్ ల కింద అనేక మృత దేహాలు ఉన్నాయి.
కాగా మృతుల సంఖ్య 288కి చేరిందని ఒడిశా ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ సుధాన్షు సారింగి వెల్లడించారు. రెస్క్యూ పని ఇంకా కొనసాగుతోందన్నారు. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారని, వారిని సమీప ఆస్పత్రులకు తరలిస్తున్నామని చెప్పారు.
ప్రయాణీకులను రక్షించడం , గాయపడిన వారికి ఆరోగ్య సాయాన్ని అందిండచం తమ ముందున్న ప్రాధాన్యత అని స్పష్టం చేశారు సుధాన్షు సారంగి.
Also Read : Odisha Train Accident