KTR IT Jobs : ఐటీ సెక్టార్ లో హైదరాబాద్ భళా – కేటీఆర్
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
KTR IT Jobs : ఐటీ సెక్టార్ లో ఊహించని రీతిలో హైదరాబాద్ ముందంజలో ఉందన్నారు మంత్రి కేటీఆర్(KTR). గతంలో బెంగళూరు పేరు చెప్పే వారని కానీ ఇప్పుడు సీన్ మారిందన్నారు.రూ. 1.8 లక్షల కోట్లకు ఎగుమతులు చేరాయని తెలిపారు. టీ హబ్ లో ఐటీ శాఖ 9వ వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్ సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఐటీ పరంగా భాగ్యనగరం దూసుకు పోతోందని చెప్పారు. ఐటీ విభాగంలో 3 లక్షల 20 వేల ఉద్యోగాలు గతంలో ఉండేవని కానీ ఇప్పుడు ఆ సంఖ్య రెట్టింపు అయ్యిందన్నారు కేటీఆర్. 7 లక్షలకు పైగా జాబ్స్ కల్పించామని తెలిపారు. కరోనా సమయంలో సైతం ఐటీ , లాజిస్టిక్ సెక్టార్లు నిరంతరాయంగా పని చేశాయని చెప్పారు కేటీఆర్.
కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం మాట సాయం తప్ప ఆర్థికంగా ఎలాంటి సహకారం అందించ లేదని వాపోయారు. తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన ఐటీఐఆర్ ను కూడా కేంద్రం రద్దు చేసిందని ఇంతకంటే వివక్ష ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు మంత్రి. ఐటీ శాఖ చేస్తున్న కృషిలో భాగంగా పెద్ద ఎత్తున సంస్థలు తెలంగాణలో ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వచ్చాయని తెలిపారు. క్వాల్ కామ్ హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేస్తోందని , గూగుల్ భారీ కేంద్రాన్ని నిర్మించేందుకు యత్నిస్తోందని వెల్లడించారు కేటీఆర్.
Also Read : Nara Lokesh : జనం కోసం తెలుగుదేశం – లోకేష్