Somu Veerraju : విశాఖ, తిరుపతిలో షా, నడ్డా సభలు
వెల్లడించిన బీజేపీ చీఫ్ సోమూ వీర్రాజు
Somu Veerraju : ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచింది. ఈ నెలలో ముగ్గురు కీలక నేతలు రాష్ట్రంలో పర్యటిస్తారని వెల్లడించారు ఆ పార్టీ చీఫ్ సోమూ వీర్రాజు(Somu Veerraju). బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖలో జరిగే బహిరంగ సభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా , తిరుపతిలో జరిగే సభలో బీజేపీ జాతీయ చీఫ్ జేపీ నడ్డా పాల్గొంటారని చెప్పారు.
అంతే కాకుండా త్వరలో కర్నూలు, హిందూపురం, తదితర ప్రాంతాల్లో కేంద్ర మంత్రి దేవీసింగ్ చౌహాన్ పర్యటిస్తారని స్పష్టం చేశారు సోమూ వీర్రాజు. ఇక రాజమండ్రిలో కేంద్ర మంత్రి మురళీధరన్ పర్యటన ఖరారు కానుందన్నారు. మరో ఇద్దరు ఎంపీల పర్యటనలు కూడా ఉన్నాయని త్వరలోనే వాటి వివరాలు తెలియ చేస్తామని చెప్పారు బీజేపీ చీఫ్.
ఇక మోడీ తొమ్మిదేళ్ల పాలనపై 13 రకాల వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఇంటింటికీ వెళ్లేలా కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు సోమూ వీర్రాజు. మరో వైపు జాతీయ నాయకులు కూడా హాజరవుతారని తెలిపారు. ఇప్పటికే కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్ పవార్ నాలుగు రోజుల పాటు ఏపీలో పర్యటించారని వెల్లడించారు.
టీడీపీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి అమిత్ షాను కలవడంపై స్పందించారు సోమూ వీర్రాజు. ఆయన సీనియర్ నాయకుడని తమ పెద్దలను కలవడంలో తప్పు లేదన్నారు. రాష్ట్ర నేతలకు దీని గురించిన సమాచారం లేదన్నారు.
Bharti Pravin Pawar : ఏపీ సర్కార్ పై కేంద్ర మంత్రి ఫైర్