Sharad Pawar : దేశంలో బీజేపీకి ఎదురు గాలి – పవార్
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కితాబు
Sharad Pawar : ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎవరికీ తెలియదు. ఆయన చేసే కామెంట్స్ ఒక్కోసారి కలకలం రేపుతాయి. మరోసారి ఆలోచింప చేసేలా ఉంటాయి. బుధవారం ఔరంగాబాద్ లో శరద్ పవార్(Sharad Pawar) మీడియాతో మాట్లాడారు. దేశంలో భారతీయ జనతా పార్టీకి ఎదురు గాలి వీస్తోందన్నారు. కానీ పనిలో పనిగా ఆ పార్టీకి చెందిన కేంద్ర ఉపరితల రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీని ఆకాశానికి ఎత్తేశాడు. ఆయనను ప్రశంసలతో ముంచెత్తాడు. మరో వైపు ఓ వైపు కాంగ్రెస్ , శివసేన పార్టీలతో పొత్తు కుదుర్చుకున్న శరద్ పవార్ ఉన్నట్టుండి సీఎం ఏక్ నాథ్ షిండేను కలిశారు. దీనిపై పెద్ద ఎత్తున రాద్ధాంతం జరిగింది. ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
తాను స్వంత పనుల కోసం వెళ్లలేదని , ఉత్సవాలకు సంబంధించి ఆహ్వానం ఇచ్చేందుకు వెళ్లాలనని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఎవరూ నమ్మలేదు. శరద్ పవార్ రాజకీయ చాణక్యం చాలా భిన్నంగా ఉంటుంది. ఎప్పుడు ఎవరితో కలుస్తారో ఏం మాట్లాడతారో ఎవరికీ తెలియదు. మొన్నటికి మొన్న పీఎం మోదీతో భేటీ అయ్యారు. అటు అధికార పక్షంతోనూ ఇటు ప్రతిపక్షాలతోనూ స్నేహంగా ఉండడం తన పనులను పూర్తి చేసుకోవడం శరద్ పవార్ కు వెన్నతో పెట్టిన విద్య అన్న ఆరోపణలు లేక పోలేదు.
కర్ణాటకలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీని ప్రజలు వద్దుకున్నారని, ఇదే వేవ్ దేశ వ్యాప్తంగా కొనసాగే ఛాన్స్ ఉందన్నారు శరద్ పవార్. మరాఠాలో చిన్న చిన్న సంఘటనలకు కులం, మతం రంగు ఆపాదించడం మంచి పద్దతి కాదన్నారు ఎన్సీపీ చీఫ్.
Also Read : JDS BJP Alliance : బీజేపీతో దోస్తీకి జేడీఎస్ రెడీ