IND vs AUS WTC Final : చెలరేగిన హెడ్..స్టీవ్ స్మిత్
భారత బౌలర్ల బేజార్
IND vs AUS WTC Final : ఇంగ్గండ్ లోని ఓవెల్ వేదికగా జరుగుతున్న ప్రపంచ టెస్టు క్రికెట్ ఛాంపియన్ షిప్ ఫైనల్(IND vs AUS WTC Final) మ్యాచ్ లో మొదటి రోజు ప్రత్యర్థి ఆస్ట్రేలియాదే పై చేయి అయ్యింది. టాస్ ఓడి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నందుకు రోహిత్ శర్మకు షాక్ తగిలింది. బరిలోకి దిగిన ఆసిస్ ను ఆరంభంలో భారత బౌలర్లు కట్టడి చేసినా ఆ తర్వాత మైదానంలోకి వచ్చిన స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ దుమ్ము రేపారు.
ఆకాశమే హద్దుగా చెలరేగారు. లబూషేన్ 26 పరుగులకు మహమ్మద్ షమీ అద్బుతమైన బంతికి బౌల్డ్ కాగా 46 పరగులతో ఫామ్ లో ఉన్న స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ శార్దూల్ ఠాకూర్ చేతికి చిక్కాడు.
ఆ సమయంలో మైదానంలోకి వచ్చిన స్మిత్ , హెడ్ లు తమ అనుభవాన్ని రంగరించారు. భారత బౌలర్ల భరతం పట్టారు. అవసరమైన ప్రతి సారి షాట్స్ తో ఆకట్టుకున్నారు. ఇద్దరూ పోటీ పడి ఆడారు. ట్రావిస్ హెడ్ సెంచరీతో చెలరేగితే స్టీవ్ స్మిత్ సెంచరీకి చేరువులో ఉన్నాడు. దీంతో ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశగా అడుగులు వేస్తోంది. ఆట ముగిసే సమయానికి కేవలం 3 వికెట్లు కోల్పోయి 327 రన్స్ మాత్రమే చేసింది.
ఖవాజ్ వికెట్ ను సిరాజ్ పడగొట్టిన ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. తొలి సెషన్ లో 2 వికెట్లు కోల్పోగా రెండో సెషన్ లో కేవలం ఒక వికెట్ మాత్రమే ఆస్ట్రేలియా చేజార్చుకుంది. ఇక ఆట ముగిసే సమయానికి ట్రావిస్ హెడ్ 146 పరుగులతో నాటౌట్ గా మిగలగా స్టీవ్ స్మిత్ 95 రన్స్ తో క్రీజులో ఉన్నాడు.
Also Read : Nara Lokesh : సీమ ప్రజలకు ఆత్మ గౌరవం ఎక్కువ