Smriti Irani Fire : హామీలపై నిలదీత స్మృతీ కన్నెర్ర
మీడియాపై నోరు పారేసుకున్న కేంద్ర మంత్రి
Smriti Irani Fire : కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి కోపం వచ్చింది. ఆమె పదే పదే కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం గుప్పిస్తోంది. ఆయనకు రాజకీయం తెలియదని, ప్రత్యేకించి భారత దేశం పట్ల అవగాహన లేదని మండిపడ్డారు.
తాజాగా స్మృతీ ఇరానీ(Smriti Irani) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మీడియాపై. గతంలో ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసిన స్మృతీ ఇరానీ పలు హామీలు ఇచ్చారు. ఆనాటి సర్కార్ ను కడిగి పారేశారు. కేవలం 13 రూపాయలకే కిలో పంచదార ఇస్తామని, గ్యాస్ సిలిండర్ అందరికీ అందుబాటులో ఉండేలా చేస్తామని హామీ ఇచ్చారు. వీటి గురించి ప్రత్యేకంగా మీడియా ప్రస్తావించింది.
అంతే కాదు దేశంలో తమ పార్టీకి చెందిన డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, యూపీకి చెందిన ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై మహిళా రెజ్లర్లు రోడ్డెక్కారు. ఆయనను అరెస్ట్ చేయాలని కోరారు. న్యాయం కోసం ఆందోళన చేపట్టిన వారిపై ఢిల్లీ ఖాకీలు అమానుషంగా ప్రవర్తించారు. అంతే కాదు దేశంలో ఎందరో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ఒక మహిళగా, కేంద్ర మంత్రి స్థానంలో ఉన్న మీరు ఎందుకని స్పందించడం లేదంటూ ప్రశ్నించారు.
దీనిపై తీవ్రంగా స్పందించారు స్మృతీ ఇరానీ. ఆమె సంయమనం కోల్పోయారు. జర్నలిస్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెళ్లి పోయారు.
Also Read : IND vs AUS WTC Final : భారత్ పోరాటం ఆస్ట్రేలియా ఆధిక్యం