MK Stalin Launch : డీఎంకే సైట్ లో సమస్త సమాచారం
కలైఘర్ 100ని ప్రారంభించిన ఎంకే స్టాలిన్
MK Stalin Launch : దేశ రాజకీయాలలో తమిళనాడు రాష్ట్రానికి ప్రత్యేకం. అక్కడ రెండే రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూ వస్తోంది. గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా కొలువు తీరింది. కానీ కరుణానిధికి చెందిన ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పార్టీ ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉంది. దివంగత సీఎం తనయుడు ఎంకే స్టాలిన్(MK Stalin) ప్రస్తుతం సీఎంగా కొనసాగుతున్నారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ది కోసం పిన చేస్తున్నారు. ప్రధానంగా పేదలకు , బడుగు, బలహీన వర్గాలకు మేలు చేకూర్చేలా చర్యలు చేపట్టారు.
ఆయన తనతో పాటు తన పార్టీ నుంచి హిందీ భాషను వ్యతిరేకిస్తున్నారు. పెద్ద ఎత్తున ఉద్యమించిన చరిత్ర కూడా తమిళనాడుకు ఉంది. వాళ్లు దేనినైనా ఒప్పుకుంటారు కానీ తమను, తమ సంస్కృతి, నాగరికత, అలవాట్లు, చరిత్రను, రాష్ట్రాన్ని, ప్రజలను ఏమైనా అంటే తట్టుకోలేరు. తమిళనాడుకు చెందిన వేలాది మంది వివిధ రంగాలలో కీలకమైన పదవుల్లో రాణిస్తున్నారు. ప్రత్యేకించి ఐటీ సెర్చింగ్ దిగ్గజంగా వినుతికెక్కిన గూగుల్ కు సిఇఓ గా ఉన్న సుందర్ పిచాయ్ కూడా తమిళనాడు వాసే.
ఇదిలా ఉండగా డీఎంకే ఏర్పడి కొన్నేళ్లవుతోంది. కరుణానిధిని అక్కడ కలైఘర్ అని పిలుచుకుంటారు. శనివారం సీఎం ఎంకే స్టాలిన్ తమ పార్టీకి చెందిన డీఎంకే. ఇన్ వెబ్ సైట్ ను , కలైఘర్ 100ని లాంచ్ చేశారు. ఇప్పటి వరకు డీఎంకే వెబ్ సైట్ ఉంది. కానీ పూర్తి సమాచారం అందుబాటులోకి తీసుకు వచ్చేలా చేసింది ఆ పార్టీ. ఇది ప్రతి ఒక్కరికీ తెలియ చేసేందుకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు సీఎం.
Also Read : Ashok Gehlot : రాజస్థాన్ లో బీజేపీ గెలవదు – సీఎం