Devanuru Mahadeva : దేవనూరు మహాదేవ కలకాలం జీవించు
సృజనాత్మక రచయిత..సామాజిక కార్యకర్త
Devanuru Mahadeva : కన్నడ నాట విలువలకు కట్టుబడిన సృజనాత్మక రచయిత, సామాజిక కార్యకర్త దేవనూరు మహాదేవ పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా కర్ణాటక పీసీసీ చీఫ్ , డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ శనివారం ట్విట్టర్ వేదికగా దేవనూరు మహాదేవకు(Devanuru Mahadev ) పుట్టిన రోజు అభినందనలు తెలిపారు. జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలని , ప్రజల తరపున రాయాలని కోరారు. ఈ సందర్బంగా ఆయనతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.
మీ అద్భుతమైన కలం నుండి మరిన్ని సామాజిక , విలువైన రచనలు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు డీకే శివకుమార్. దేవనూరు నంజన్ గూడ తాలూకాలో పుట్టాడు. కన్నడ సాహిత్యంలో పేరు పొందిన రచయిత. దళిత బందాయి సాహిత్య ఉద్యమానికి ఊపిరి పోశాడు దేవనూరు మహాదేవ(Devanuru Mahadev). జాతీయ పరంగా సాహిత్య అకాడమీతో పాటు పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. భారత ప్రభుత్వం ఆయన చేసిన సేవలను గుర్తించింది..గౌరవించింది.
దేవనూరు మహాదేవ సాహిత్య వర్గాలలో తిరుగుబాటుదారుడిగా పేరొందారు. 2010లో నృపతుంగ పురస్కారాన్ని తిరస్కరించారు. దీనికి కింద రూ. 5,01,000 ను వద్దనుకున్నారు. కన్నడ భాషను అధికార భాషగా ప్రకటించక పోవడాన్ని తప్పు పట్టాడు. కుసమ బాలే నవలకు జాతీయ పురస్కారం దక్కింది. 1990 దశకంలో రచయితల కోటా కింద రాజ్యసభ సీటు ఆఫర్ చేసినా సున్నితంగా తిరస్కరించిన అరుదైన రచయిత. 2022లో మహాదేవ ఆర్ఎస్ఎస్ పై పుస్తకాన్ని రాశాడు. అది ఆదరణ పొందింది. అంతకు మించి విమర్శలు మూటగట్టుకుంది.
Also Read : Yuvraj Singh Wishes : బాలయ్యకు యువీ విషెస్