Supriya Sule : పార్లమెంట్ ను పవార్ నడపడం లేదు
బంధుత్వం కాదు పనితీరు చూడండి
Supriya Sule : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) కి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితురాలైన ఎంపీ సుప్రియా సూలే సంచలన కామెంట్స్ చేశారు. కేవలం బంధుత్వాన్ని మాత్రమే చూస్తున్నారని పని తీరును ఎందుకు ప్రాతిపదికగా తీసుకోవడం లేదంటూ ప్రశ్నించారు. ఆదివారం ఎంపీ మీడియాతో మాట్లాడారు. విచిత్రం ఏమిటంటే పార్లమెంట్ ను తాము నడపడం లేదని గ్రహించాలని పేర్కొన్నారు.
పదే పదే తమను కావాలని టార్గెట్ చేయడం మంచి పద్దతి కాదన్నారు సుప్రియా సూలే(Supriya Sule). తాను ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం సబబేనని, తాను ఇందుకు అర్హురాలినేనంటూ స్పష్టం చేశారు. తన తండ్రి శరద్ పవార్ తనను నియమించడం సరైనదేనని పేర్కొన్నారు. ఈ దేశంలో ఉన్న ప్రతి పార్టీలో బంధుప్రీతి అన్నది ఉందన్న వాస్తవం గుర్తించడం లేదని ఎద్దేవా చేశారు. ఇద్దరిని వర్కింగ్ ప్రెసిడెంట్స్ గా నియమించారు శరద్ పవార్. ఇటీవలే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. చివరకు ఒత్తిడి పెరగడంతో తన నిర్ణయాన్ని విరమించుకున్నారు.
లోక్ సభ డేటా చార్ట్ లో తాను అగ్ర స్థానంలో ఉన్నానని ఇంతకంటే ఇంకేం కావాలని ప్రశ్నించారు సుప్రియా సూలే. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎంపిక కావడంలో తన పట్ల ఎలాంటి అశ్రిత పక్షపాతం లేదన్నారు ఎంపీ. ఇక శరద్ పవార్ తన మేనల్లుడు అజిత్ పవార్ కు ఎందుకు పదవి ఇవ్వలేదనే ప్రశ్నకు సుప్రియా సూలే భిన్నంగా స్పందించారు. ఆయన ఇప్పటికే బిజీగా ఉన్నారని పేర్కొన్నారు.
Also Read : CM Siddaramaiah : చీఫ్ సెక్రటరీకి సీఎం ఉచిత టికెట్