Pawan Kalyan Jagan : జగన్ పై భగ్గుమన్న జనసేనాని
ప్రసంగం వ్యక్తిగత విమర్శలకే పరిమితం
Pawan Kalyan Jagan : జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. వారాహి విజయ యాత్ర సందర్బంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ప్రసంగం పూర్తిగా వ్యక్తిగత విమర్శలకు దారి తీసింది. ఎక్కువగా ఏపీ సీఎంను టార్గెట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. స్థానిక ఎమ్మెల్యేలను కూడా వదిలి పెట్టలేదు. ఇదే సమయంలో సంచలన కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్. తాను పొత్తుల నుండి పక్కకు వచ్చేశానని అన్నారు. ఆపై నాకు పదవి ఇవ్వండి , సీఎంను చేయండి అని కోరారు. అసెంబ్లీకి వెళ్లి ఒక్కొక్కరి తాట తీస్తానని వార్నింగ్ ఇచ్చారు.
ఒక్క ఛాన్స్ ఇవ్వండి రాష్ట్రాన్ని పరిపాలిస్తానని అన్నారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan). నచ్చక పోతే తానే స్వచ్చంధంగా దిగి పోతానని చెప్పారు. సర్పవరం జంక్షన్ లో భారీ ఎత్తున చేరుకున్న జన సందోహాన్ని ఉద్దేశించి మరింత రెచ్చి పోయారు జనసేన చీఫ్. గత రెండు రోజులుగా స్థానికంగా నిర్వహించిన జనవాణి కార్యక్రంలో వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్నారు.
ఆపై వ్యక్తిగత విమర్శలకు దిగారు జనసేన చీఫ్. గూండాలు, నేరస్థులకు వైసీపీ కేరాఫ్ గా మారిందని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని మండిపడ్డారు. ఒక ఎంపీని , కుమారుడిని కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేశారంటే ఇంక సామాన్యులకు రక్షణ ఎక్కడ ఉందని ప్రశ్నించారు.
Also Read : S Suresh Kumar : ఏపీలో 24 వరకు ఒంటి పూట బడులు