TTD Yoga Day : తిరుమలలో యోగా దినోత్సవం
పాల్గొన్న టీటీడీ సిబ్బంది, భక్తులు
TTD Yoga Day : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం తిరుమలలోని ఆస్థాన మండపంలో తిరుమల తిరుపతి దేవస్థానం(TTD Yoga Day) సిబ్బంది, భక్తులు, శ్రీవారి సేవకులకు 2 గంటల పాటు శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ ఆధ్వర్యంలో చేపట్టారు.
ఈ సందర్భంగా ఇన్ స్పెక్టర్ వైవీ రెడ్డి మాట్లాడారు. భారత ప్రభుత్వం లోని 53వ బెటాలియన్ ఐటీబీపీ దీనిని చేపట్టింది. డిప్యూటీ కమాండెంట్ అయుష్ దీపక్ పర్యవేక్షణలో అమిత్ భాటి, కమాండెంట్ 53 బీఎన్ సూచనల మేరకు సెషన్ , యోగా సాధన చేపట్టారు.
యోగా సాధన చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు శిక్షకులు. కుటుంబానికి, సమాజానికి, యావత్ దేశానికి మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రతి రోజు కనీసం 45 నిమిషాల పాటు యోగా ఆసనాలు, ధ్యానం చేసే అలవాటును పెంపొందించు కోవాలని సూచించారు.
ఐటీబీపీ నుండి యోగా శిక్షకులు దినేష్ జోషి, సూరజ్ సింగ్ లతో కలిసి వై వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్న వారికి యోగాసనాలు , ప్రాణాపాయం గురించి నేర్పించారు. అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పి. నీలిమ, విజిలెన్స్ ఇన్ స్పెక్టర్ నరసింహ పాల్గొన్నారు.
Also Read : Somu Veerraju : బాబు కామెంట్స్ సోము సీరియస్