Priyank Kharge : ఫ్యాక్ట్ చెక్ సెల్ ఏర్పాటు – ప్రియాంక్ ఖ‌ర్గే

క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం

Priyank Kharge : క‌ర్ణాట‌క‌లో కొలువు తీరిన కాంగ్రెస్ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటోంది. ఇప్ప‌టికే 5 గ్యారెంటీ ప‌థ‌కాల‌కు శ్రీ‌కారం చుట్టింది. మ‌రో వైపు బ్రాండ్ బెంగ‌ళూరు పేరుతో వెబ్ పోర్ట‌ల్ ను స్టార్ట్ చేసింది. మ‌రో వైపు కులం పేరుతో, మ‌తం పేరుతో, విద్వేషాల పేరుతో సోష‌ల్ మీడియా వేదిక‌గా రాత‌లు రాసే వారిపై ఓ క‌న్ను వేయ‌నుంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆ రాష్ట్ర ఐటీ, హోం శాఖ మంత్రి ప్రియాంక్ ఖ‌ర్గే స్ప‌ష్టం చేశారు. ఇక నుంచి ఎవ‌రినీ ఉపేక్షించే ప్ర‌స‌క్తి లేద‌న్నారు.

భార‌తీయ జ‌నతా పార్టీ ఐటీ సెల్ , వారి కార్య‌క‌లాపాలు మొద‌టి నుంచీ అనుమానాస్ప‌దంగా ఉన్నాయ‌ని మండిప‌డ్డారు. య‌ధా విధిగా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా వాళ్లు విషం చిమ్మ‌డం ప్రారంభించార‌ని ఇందుకు సంబంధించి తాము ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌ని హెచ్చ‌రించారు ప్రియాంక్ ఖ‌ర్గే(Priyank Kharge). ఎవ‌రైతే కాషాయ శ్రేణులు విద్వేషాల‌ను రెచ్చ‌గొట్టినా త‌మ వెనుక అధినాయ‌క‌త్వం ఉంద‌ని అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లేన‌ని పేర్కొన్నారు.

ఎవ‌రు ఎప్పుడు పోస్ట్ చేశార‌నే దానిపై పూర్తిగా సేక‌రిస్తామ‌ని, వారిని గుర్తించి జైలుకు పంపిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి. వాస్త‌వం ఏదో అవాస్త‌వం ఏదో తెలియ చేసేందుకు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో ఫ్యాక్ట్ సెల్ ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు ప్రియాంక్ ఖ‌ర్గే. అంతే కాకుండా హోం శాఖ‌ను స‌మీక్షించారు. మాద‌క ద్ర‌వ్యాలు, అక్ర‌మ మ‌ద్యం, అక్ర‌మ ఇసుక త‌వ్వ‌కాలు, క్వారీలు, బెట్టింగ్, జూదం, రౌడీల‌ను త‌యారు చేయ‌డం, తుపాకుల అక్ర‌మ స‌ర‌ఫ‌రా , రియ‌ల్ ఎస్టేట్ ఏజెంట్లు , త‌దిత‌ర వాటిపై ఫోక‌స్ పెట్టాల‌ని ఆదేశించారు.

Also Read : Punjab Govt Library : రెస్టారెంట్ కాదు ప్ర‌భుత్వ లైబ్రరీ

 

Leave A Reply

Your Email Id will not be published!