Raj Nath Singh : పంజాబ్ లో శాంతి భద్రతలు విఫలం
రాజ్ నాథ్ సింగ్ సంచలన కామెంట్స్
Raj Nath Singh : కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన పంజాబ్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొలువు తీరిన ఆప్ ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి భద్రతలను నియంత్రించడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు రాజ్ నాథ్ సింగ్. ఇదే సమయంలో తాను ఆప్తుడైన ప్రకాశ్ సింగ్ బాదల్ ను కోల్పోవడం బాధగా ఉందన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతీసారి తనకు గుర్తుకు వస్తారని తెలిపారు.
నరేంద్ర మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా చండీగఢ్ లో బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు రాజ్ నాథ్ సింగ్(Raj Nath Singh) ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆయన ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీని, సీఎం భగవంత్ మాన్ ను లక్ష్యంగా చేసుకున్నారు.
మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఆప్ సర్కార్ లా అండ్ ఆర్డర్ ను కాపాడటంలో ఫోకస్ పెట్టడం లేదని మండిపడ్డారు. దీని వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీని కూడా టార్గెట్ చేశారు రాజ్ నాథ్ సింగ్.
ఈ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని గగ్గోలు పెడుతున్నారని, అలా డెమోక్రసీ అన్నది డేంజర్ జోన్ లో ఉంటే మరి హిమాచల్ ప్రదేశ్ ,కర్ణాటకలలో కాంగ్రెస్ పార్టీ ఎలా అధికారంలోకి రాగలిగిందో చెప్పాలన్నారు. నిరాధార ఆరోపణలు చేయడం విపక్షాలకు అలవాటు గా మారిందని ధ్వజమెత్తారు రాజ్ నాథ్ సింగ్.
Also Read : PM Modi : ఈజిప్టు అధ్యక్షుడితో మోదీ భేటీ