KTR : అభివృద్దికి న‌మూనా తెలంగాణ – కేటీఆర్

దేశానికి త‌ల మానికం మ‌న రాష్ట్రం

KTR : తెలంగాణ రాష్ట్రం అభివృద్దికి రోల్ మోడ‌ల్ గా నిలిచింద‌ని అన్నారు ఐటీ , ప‌రిశ్ర‌మ‌ల‌, పుర‌పాలిక శాఖ మంత్రి కేటీఆర్. సోమ‌వారం భారీ ఖ‌ర్చుతో హైద‌రాబాద్ లోని ఉప్ప‌ల్ చౌర‌స్తాలో నిర్మించిన స్కై వాక్ ను ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా ఏర్పాటు చేసిన స‌మావేశంలో ప్ర‌సంగించారు.

యావ‌త్ దేశంలో ఎక్క‌డా లేని రీతిలో తెలంగాణ అన్ని రంగాల‌లో దూసుకు పోతోంద‌న్నారు. పాద‌చారుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్క‌డ స్కైవాక్ నిర్మించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. ర‌హ‌దారుల నిర్మాణం అభివృద్దికి సోపానంగా ఉంటుంద‌నే తాము గుర్తించామ‌న్నారు. ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డంలో బీఆర్ఎస్ ఎల్ల‌ప్పుడూ ముందంజ‌లో నిలిచి ఉంద‌ని తెలిపారు కేటీఆర్.

ఇవాళ సీఎం కేసీఆర్(KTR) ఆధ్వ‌ర్యంలో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ప‌ల్లెల‌ను కూడా ప‌ట్ట‌ణాల‌కు తీసిపోని విధంగా తీర్చిదిద్తుతున్నామ‌ని తెలిపారు. ఇక హైద‌రాబాద్ లో నిత్యం ట్రాఫిక్ ఉంటుంద‌ని, దీనిని దృష్టిలో పెట్టుకుని పాద‌చారుల‌కు సౌక‌ర్య వంతంగా ఉండేలా స్కై వాక్ ను అత్యంత ఆధునిక వ‌సతి సౌక‌ర్యాల‌తో నిర్మించామ‌న్నారు మంత్రి కేటీఆర్.

కొంద‌రు కావాల‌ని విమ‌ర్శ‌లు చేస్తుంటార‌ని వాటిని తాము ప‌ట్టించు కోమ‌న్నారు. అభివృద్దే త‌మ అజెండా అని , స‌మ‌స్య‌లు ఎన్ని ఉన్నా వాటిని త్వ‌రిత‌గ‌తిన ప‌రిష్క‌రించ‌డం ముందుకు వెళ‌తామ‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు.

Also Read : AP CM YS Jagan : వైఎస్సార్ లా నేస్తం అభ‌య హ‌స్తం

 

Leave A Reply

Your Email Id will not be published!