North Korea Holds : అమెరికాపై యుద్దానికి సిద్దం – కొరియా
యుఎస్ కు వ్యతిరేకంగా భారీ ర్యాలీలు
North Korea Holds : ఉత్తర కొరియా సంచలన ప్రకటన చేసింది. ఆపై ప్రపంచంపై పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నం చేస్తున్న అమెరికాపై యుద్దానికి సిద్దం అంటూ ప్రకటించింది. యుఎస్ఏకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉత్తర కొరియా ర్యాలీలు చేపట్టింది. ఈ మేరకు ఎప్పుడైనా తాము పోటీకి సిద్దంగా ఉన్నామని వెల్లడించింది. బైడెన్ కు హెచ్చరికలు జారీ చేసింది. ఎక్కడ చూసినా దేశమంతటా ర్యాలీలతో హోరెత్తించింది.
ఉత్తర కొరియా(North Korea) యుద్దం ప్రారంభమై 73వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్యోంగ్యాంగ్ లో 1,20,000 మంది గుమిగూడారు. అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని, యుద్ధ నేరాలకు అమెరికా బాధ్యత వహించాలని పెద్ద ఎత్తున ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా ఉత్తర కొరియా దేశ అధ్యక్షుడు సంచలన ప్రకటన చేశారు. యుఎస్ ప్రధాన భూ భాగం మొత్తం మా షూటింగ్ రేంజ్ లో ఉందని హెచ్చరిక చేశాడు. ఇదే సమయంలో అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న ప్ల కార్డులను ప్రదర్శించారు పెద్ద ఎత్తున. ఇదిలా ఉండగా ఉత్తర కొరియా తమ వద్ద ఉన్న అణ్వాయుధాలపై గర్వ పడింది.
వీటిని అమెరికాకు ,దాని దాష్టీకానికి వ్యతిరేకంగగా ఉపయోగించేందుకు సిద్దంగా ఉన్న బలమైన సంపూర్ణ ఆయుధం అని స్పష్టం చేసింది. దీంతో ఉత్తర కొరియా చేసిన ఈ ప్రకటన యావత్ ప్రపంచాన్ని నివ్వెర పోయేలా చేసింది.
Also Read : Tirumala Hundi : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.38 కోట్లు