Vakati Karuna : గుప్తా నిర్వాకం కరుణకు అందలం
తెలంగాణ యూనివర్శిటీ వీసీగా వాకాటి
Vakati Karuna : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ యూనివర్శిటీ వైస్ ఛాన్స్ లర్ గా ఉన్న రవీందర్ గుప్తాను తప్పించింది. ఆయన స్థానంలో విద్యా శాఖలో కీలక బాధ్యతలు చూస్తున్న వాకాటి కరుణకు వీసీగా బాధ్యతలు అప్పగించింది. గుప్తాపై పలు ఆరోపణలు వచ్చాయి. ఇష్టానుసారంగా వ్యవహరించడం, ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత పాటించక పోవడం, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో గుప్తాను తప్పించేందుకే మొగ్గు చూపింది కేసీఆర్(KCR) సర్కార్.
గత రెండు సంవత్సరాలుగా నిత్యం వివాదాలతో మునిగి పోయింది తెలంగాణ యూనివర్శిటీ. ఇదే సమయంలో వీసీ రవీందర్ గుప్తా అవినీతి నిరోధక శాఖకు అడ్డంగా దొరికారు. చివరకు జైలు పాలయ్యారు. ఆయన ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యారు. ఆ వెంటనే వీసీ పదవిలో కూర్చోకుండా ప్రభుత్వం పావులు కదిపింది. ఈ మేరకు వాకాటి కరుణకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వం నియమించిన పాలక వర్గాన్ని పక్కన పెట్టి వీసీ రవిందర్ గుప్తా ఇష్టానుసారంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. సెమినార్లు, సమావేశాల పేరుతో భారీ ఎత్తున ఖర్చు చేశారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో పూర్తిగా విద్యా వ్యవస్థ కుంటు పడింది. స్కూళ్లలో వసతి సౌకర్యాలు లేకుండా పోయాయి. భారీ ఎత్తున ఖాళీలు ఉన్నా ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేసిన పాపాన పోలేదు.
Also Read : IND vs WI 1st Test : తిప్పేసిన అశ్విన్ తలవంచిన విండీస్