Uddhav Thackeray : మోదీ నియంతృత్వం ఇక చెల్లదు
శివసేన యుబిటి చీఫ్ ఉద్దవ్ ఠాక్రే
Uddhav Thackeray : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాటం ఆగదని స్పష్టం చేశారు శివసేన యుబిటి చీఫ్ ఉద్దవ్ ఠాక్రే. దేశంలో ప్రజాస్వామ్యం అన్నది లేకుండా పోయిందన్నారు. ఇవాళ కేవలం నియంతృత్వం రాజ్యం ఏలుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విపక్షాల కమిటీ కీలక భేటీ అనంతరం ఉద్దవ్ ఠాక్రే(Uddhav Thackeray) మీడియాతో మాట్లాడారు.
Uddhav Thackeray Said
దేశ ప్రజలు ఇవాళ నిస్తేజ స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. ఇలాగే ఉండి పోతే భవిష్యత్తు తరాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇప్పటికే ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను లక్ష్యంగా చేసుకుని కూల్చి వేశారంటూ ఆరోపించారు. ఇది ఎంత మాత్రం హర్షణీయం కాదన్నారు ఉద్దవ్ ఠాక్రే.
ఇవాళ ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారని, కేంద్రంలో అధికారంలో ఉన్నామనే ధీమాతో మోదీ పనిగట్టుకుని కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ఎళ్లకాలం మోదీ హవా నడవదని, ఏదో ఒక రోజు తమకు కూడా సమయం వస్తుందని హెచ్చరించారు. ఇప్పటికైనా కళ్లు తెరవాలని లేక పోతే ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమన్నారు ఉద్దవ్ ఠాక్రే.
Also Read : Daggubati Purandeswari : ఏపీ సర్కార్ పై పురందేశ్వరి ఫైర్