Lokesh Kanagaraj : త్వరలో లియో సెకండ్ సింగిల్
దర్శకుడు లోకేష్ కనగరాజ్
Lokesh Kanagaraj : లోకేష్ కనగరాజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మేకింగ్, టేకింగ్గ లో డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పటికే ఆయన తలపతితో గతంలో మాస్టర్ తీశాడు. అది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తాజాగా ఇదే జోసెఫ్ విజయ్ తో లియో పేరుతో సినిమా తీస్తున్నాడు. ఇందుకు సంబంధించి పోస్టర్స్ రిలీజ్ చేశారు. సాంగ్ కూడా విడుదలైంది. అది దుమ్ము రేపుతోంది. తాజాగా దర్శకుడు లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) తన అభిమానులతో ముచ్చటించాడు. వారు అడిగిన ప్రశ్నలకు కూల్ గా సమాధానం ఇచ్చాడు.
Lokesh Kanagaraj Answered
లియో సినిమా గురించి అప్ డేట్ త్వరలోనే ఉంటుందని పేర్కొన్నాడు. లియో సినిమాకు సంబంధించి మొదటి సింగిల్ కు విపరీతమైన జనాదరణ లభించిందన్నాడు. ఆరు నెలల్లోనే సినిమాను పూర్తి చేశాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. ఓ కాలేజీ ఫంక్షన్ లో పాల్గొన్నాడు. విద్యార్థులతో ముచ్చటించాడు లోకేష్ కనగరాజ్.
త్వరలోనే లియో సెకండ్ సింగిల్ కూడా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించాడు దర్శకుడు. ఇదిలా ఉండగా లియో చిత్రంలో తలపతి విజయ్ తో పాటు త్రిష, సంజయ్ దత్ , తదితరులు నటించారు. ఇక మొదటి సింగిల్ నా రెడీ విజయ్ పుట్టిన రోజున రిలీజ్ చేశారు. ఇది టాప్ లో నిలిచింది.
Also Read : Janasena Slams : రోజా నోరు జారితే జాగ్రత్త