Rahul Gandhi : ప్రజా నాయకుడు ఊమెన్ చాందీ
ఆయన నాయకత్వం స్పూర్తి దాయకం
Rahul Gandhi : కేరళ మాజీ సీఎం, దివంగత నేత ఊమెన్ చాందీ చేసిన సేవలు ప్రశంసనీయమని కొనియాడారు ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ. మలప్పురంలోని డీసీసీ కార్యాలయంలో ఊమెన్ చాందీ స్మృత్యర్థం సంతాప సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కేరళ రాజకీయాలలోనే కాదు భారత దేశ రాజకీయాలలో అరుదైన నాయకుడు ఊమెన్ చాందీ అని ప్రశంసించారు.
Rahul Gandhi Said
ఆయన లేని పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు. జీవితాంతం ప్రజల కోసం పని చేసిన అరుదైన రాజకీయ వేత్త అని కితాబు ఇచ్చారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). సుదీర్ఘ కాలం పాటు కేరళ రాజకీయాలను ఊమెన్ చాందీ శాసించారని, ఎన్నో ప్రజా ప్రయోజన కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారని ప్రశంసించారు.
ఇదిలా ఉండగా ఊమెన్ చాందీ కాంగ్రెస్ పార్టీలో 50 ఏళ్లకు పైగా పని చేశారు. ఇటీవల క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన 11 సార్లు ప్రజా ప్రతినిధిగా ఉన్నారు. కేరళ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా, అధికారంలో ఉంటూ ప్రజా నాయకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు ఊమెన్ చాందీ.
Also Read : Pilli Subhash Chandra Bose : జగన్ ఆదేశం ముగిసిన వివాదం