Vizag Steel : విశాఖ అట్టుడుకుతోంది. ఏపీ రాజకీయం వేడెక్కింది. కొన్ని తరాలుగా వేలాది మందికి ప్రత్యంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ వస్తోంది. ఈ ఉక్కు పరిశ్రమకు ఘనమైన చరిత్ర ఉంది.
32 మంది ఈ ప్లాంటు కోసం బలిదానం చేశారు. వీరి త్యాగాల వల్లనే విశాఖకు ప్లాంట్ వచ్చింది. ఉన్నట్టుండి కేంద్ర ప్రభుత్వం పుండు మీద కారం చల్లింది. ప్రశాంతంగా ఉన్న ఏపీలో తేనె తుట్టె కదిలించింది.
విశాఖ స్టీల్ ప్లాంట్(Vizag Steel) ను ప్రైవేటీకరిస్తున్నట్లు కేంద్ర సర్కార్ ప్రకటించింది పార్లమెంట్ సాక్షిగా. దీంతో పెద్ద ఎత్తున ప్రజాగ్రహం పెల్లుబికింది. ఏకంగా వేలాది మంది ఉద్యోగులు, ప్రజలు, ప్రజా సంఘాలు, వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు రోడ్డెక్కారు.
టీడీపీ, వామపక్షాలు సీరియస్ తీసుకున్నాయి. మరో వైపు జనాగ్రహం భగ్గుమంది. అధికార పార్టీ వైసీపీకి కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
దీంతో రాజకీయం మరింత వేడెక్కింది. ప్రాణాలు పోయినా సరే తాము ప్రైవేటీకరణ ఒప్పుకోబోమని స్పష్టం చేశారు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ. ఈ అంశం రాష్ట్రంతో ముడిపడి ఉండడంతో రంగంలోకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగారు.
వెంటనే విశాఖ స్టీలు ప్లాంట్(Vizag Steel) ను ప్రవేటీకరణ మాను కోవాలని, పునరాలోచించాలని, కొంత సపోర్ట్ ఇవ్వగలిగితే బాగు పడుతుందని పీఎం ప్రధానికి రాసిన లేఖలో ప్రస్తావించారు. అవంతి శ్రీనివాస్ సైతం ప్రైవేటీకరణ ఒప్పుకోమన్నారు.
ఎంపీ విజయసాయి రెడ్డి స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని కోరారు. ఈ మేరకు ప్రధానిని కలిసి విన్నవిస్తామన్నారు. మాజీ పోలీసు అధికారి లక్ష్మీనారాయణ సెయిల్ తో విశాఖ స్టీల్ ప్లాంట్ ను అనుసంధానం చేస్తే లాభాల బాటలో పయనిస్తుందన్నారు.
ఈ పరిశ్రమకు సంబంధించి 19 వేలకు పైగా ఎకరాల స్థలం ఉంది. దీని విలువ లక్ష కోట్ల రూపాయల వరకు ఉంటుందన్నారు. ఇక బీజేపీలో రెండు వర్గాలుగా చీలి పోయారు నేతలు.
బీజేపీ ఎంపీ సుజనా చౌదరి మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంత పోరాటం చేసినా ప్రైవేటీకరణ జరిగి తీరుతుందన్నారు.మరో వైపు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి దేవి మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ ఉండదని దాని కోసం పాటు పడతామన్నారు.
ఇదిలా ఉండగా అన్ని పార్టీలకు ఇపుడు ఈ సమస్య మెడకు చుట్టుకునేలా ఉంది. ప్రజలు భేదాలను వీడి ఒక్కటిగా ముందుకు వస్తున్నారు. తాము ఎవ్వరినీ ఉపేక్షించే ప్రసక్తి లేదంటున్నారు. ఇప్పటికే సగం దేశాన్ని అమ్మేసిన మోదీ దీనిని వదిలేస్తారో లేదో అన్నది ప్రశ్న.
No comment allowed please