Janasena Slams : అమర్నాథ్ భూదోపిడి సంగతేంటి
హెచ్చరించిన జనసేన పార్టీ
Janasena Slams : జనసేన పార్టీ సిద్దాంతం , లక్ష్యం ఏమిటో చెప్పలేని స్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఆయన చేసిన కామెంట్స్ పై తీవ్ర స్థాయిలో మండిపడింది జనసేన పార్టీ. శనివారం ట్విట్టర్ వేదికగా స్పందించింది. త్వరలోనే నీ బండారం బయట పెడతామని ప్రకటించింది. జావా ప్రోగ్రామింగ్ అంటే ఏమిటి అని అడిగితే రాగి జావా అని చెప్పే నీకు పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించే అధికారం లేదని పేర్కొంది.
Janasena Slams YSRCP
నీ బతుక్కి నీ శాఖ గురించే తెలియదు. ఇక జనసేన పార్టీ(Janasena Party) సిద్దాంతాలు, ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగం లాంటివి ఎలా అర్థం అవుతాయని ప్రశ్నించింది. ఈనెల 14 వరకు ఓపిక పట్టు గుడివాడ అమర్నాథ్. నువ్వు ఏమిటో , నీ సంగతి ఏమిటో..విస్సన్నపేట భూ దోపిడీ ఏమిటో త్వరలోనే బయట పెడతామని ప్రకటించింది జనసేన పార్టీ. అప్పటి వరకు ఏం చేయాలో ఆలోచించుకో అని సూచించింది.
పొద్దస్తమానం మా నాయకుడు పవన్ కళ్యాణ్ ను వ్యక్తగతంగా దూషించడం తప్ప మరో పనేమీ మీకు లేదంటూ మండిపడింది. బాధ్యత కలిగిన మంత్రులు చేయాల్సింది ప్రజా సమస్యలను పరిష్కరించడం . కానీ మీరు వాటిని విస్మరించడం దారుణమని పేర్కొంది.
Also Read : Chandrababu Naidu : టీటీడీపై భగ్గుమన్న టీడీపీ చీఫ్