G Valliswar : వ‌ల్లీశ్వ‌ర్ కు ప్ర‌తిభ పుర‌స్కారం

ప్ర‌క‌టించిన తెలుగు యూనివ‌ర్శిటీ

G Valliswar : సీనియ‌ర్ పాత్రికేయుడు జి. వ‌ల్లీశ్వ‌ర్ కు అరుదైన గౌర‌వం ల‌భించింది. తెలుగు విశ్వ విద్యాల‌యం 2021 సంవ‌త్స‌రానికి గాను ప్ర‌తిభ పుర‌స్కారానికి ఆయ‌న‌ను ఎంపిక చేసింది. పాత్రికేయ రంగంలో ఎంతో అనుభ‌వం ఉంది జి. వ‌ల్లీశ్వ‌ర్ కు. ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక ఈనాడు లో పూర్వ ప్ర‌తినిధిగా ఉన్నారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌తి సంవ‌త్స‌రం వివిధ రంగాల‌లో విశేష‌మైన కృషి చేసినందుకు గాను 12 మందిని తెలుగు విశ్వ విద్యాయ‌లం విశిష్ట పుర‌స్కారాల‌తో స‌త్క‌రించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది.

G Valliswar was awarded Pratibha Award

జి. వ‌ల్లీశ్వ‌ర్ ఈనాడు దిన‌ప‌త్రికలో ఏలూరు, తిరుప‌తి, విశాఖ‌ప‌ట్నం, న్యూఢిల్లీ, హైద‌రాబాద్ ల‌లో దాదాపు 26 ఏళ్ల పాటు రిపోర్టింగ్ లో ప‌ని చేశారు. ఆయ‌న చేసిన కాలం 1978 నుంచి 2004 దాకా . ఇదే సంస్థ‌లో ఈనాడ‌కు చెందిన ఇంగ్లీష్ దిన‌ప‌త్రిక న్యూస్ టైమ్ లో బ్యూరో చీఫ్ గా ఉన్నారు.

ప్ర‌ధానంగా జి. వ‌ల్లీశ్వ‌ర్(G Valliswar) వైజాగ్ లోని నౌకా ద‌ళం, షిప్ యార్డు, స్టీల్ ప్లాంట్, పోర్ట్ ట్ర‌స్ట్ , త‌దిత‌ర ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌పై ప‌రిశోధ‌నా వ్యాసాలు రాశారు. అవి పెద్ద ఎత్తున ఆద‌ర‌ణ చూర‌గొన్నాయి. దీంతో ఆయ‌న పేరు మారుమ్రోగింది తెలుగు నాట‌. 2005 నుంచి 2015 కాలంలో ఆంధ్ర ప్ర‌దేశ్ మాస ప‌త్రిక ప్ర‌ధాన సంపాద‌కుడిగా ఉన్నారు. ఆ ప‌త్రిక‌కు పేరు తీసుకు వ‌చ్చేలా చేశారు.

Also Read : TTD Members Comment : టీటీడీ పాల‌క మండ‌లిపై పాలిటిక్స్

Leave A Reply

Your Email Id will not be published!