AP CM YS Jagan : విద్యార్థుల సమస్యలపై జగన్ ఫోకస్
యుఎస్ ఇమ్మిగ్రేషన్ సంస్థ నిర్వాకం
AP CM YS Jagan : ఏపీ విద్యార్థులతో సహా కొంత మంది భారతీయ విద్యార్థులను యుఎస్ ఇమ్మిగ్రేషన్ సంస్థ తిప్పి పంపింది. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ స్పందించింది. ఈ మేరకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వెంటనే రియాక్ట్ అయ్యారు. తెలుగు వారికి సంబంధించిన విద్యార్థులు ఉన్నట్లయితే వారిని క్షేమంగా తీసుకు రావడానికి, లేదా అక్కడే వారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
AP CM YS Jagan New Rule
ఎయిర్ పోర్టుల నుంచే ఇండియాకు యుఎస్ ఇమ్మిగ్రేషన్ సెంటర్ నిర్వాహకులు తిప్పి పంపిస్తున్నారు. దీనిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు సీఎం(AP CM YS Jagan). విద్యార్థులంతా వారి ఉన్నత చదువుల కోసం వ్యాలిడ్ వీసాను కలిగి ఉన్నారని తెలిపారు. వారి కెరీర్ ను దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా వారి సమస్యలను పరిష్కరించాలని సీఎం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖను కోరారు.
ఇదిలా ఉండగా అమెరికా వీసా ఉన్నంత మాత్రాన ఆ దేశంలోకి ఎంట్రీ గ్యారెంటీ లేదనే విషయాన్ని సర్కార్ గుర్తించింది. ప్రధానంగా యుఎస్ కు వెళ్లే స్టూడెంట్స్ యుఎస్ ఇమ్మిగ్రేషన్ వద్ద కస్టమ్స్ , బోర్డర్ ప్రొటక్షన్ అధికారులు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్థిక పరమైన రుజువులు, ఇతర ధ్రువీకరణ పత్రాలు, అమెరికా ఇమ్మిగ్రేషన్ , నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలపై అవగాహన ఉండాలి. చదువుతున్న యూనివర్శిటీల గురించి కూడా తెలుసు కోవాలని ఏపీ సర్కార్ సూచించింది.
ఇక విద్యార్థులు ఏదైనా సాయం కావాలంటే ఏపీఎన్‌ఆర్‌టీఎస్ 24/7 హెల్ప్‌లైన్ నంబర్లు +91 8632340678, 8500027678 కు 24/7 ఫోన్ చేయొచ్చు లేదా info@apnrts.com లేదా helpline@apnrts.com కు మెయిల్ చేయొచ్చు.
Also Read : G Valliswar : వల్లీశ్వర్ కు ప్రతిభ పురస్కారం