MLA Rekha Nayak Slams : కేసీఆర్ పై రేఖా నాయక్ గుస్సా
మంత్రి పదవి అడుగతానని టికెట్ ఇవ్వలే
MLA Rekha Nayak Slams : ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తాను కష్టపడి పైకి వచ్చానని అన్నారు. సీఎం కేసీఆర్ తనకు ఈసారి ఎన్నికల్లో టికెట్ ఇవ్వక పోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
కేవలం రాబోయే ఎన్నికల్లో తాను గెలుస్తానని ఆయనకు తెలుసన్నారు రేఖా నాయక్. అయితే కేబినెట్ లో మంత్రి కావాలని తాను అడుగుతానని ముందే ఊహించారని అందుకే తనకు టికెట్ రాకుండా చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే .
MLA Rekha Nayak Slams KCR
ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం మాను కోవాలని సూచించారు. ఇవాళ ఆమె సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను భారత రాష్ట్ర సమితి పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు.
తాను ఎందుకు పార్టీని వీడాల్సి వచ్చిందో తెలిపారు ఎమ్మెల్యే రేఖా నాయక్(MLA Rekha Nayak). తాను ఎక్కడ మంత్రి పదవి అడుగుతానోనని తనకు టికెట్ రాకుండా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ లో ఉన్నత వర్గాలకే ప్రయారిటీ ఉంటుందని, మా లాంటి బడుగులు, బహుజనులకు , గిరిజనులకు ప్రాధాన్యత ఉండదని ఆరోపించారు ఎమ్మెల్యే.
ఇదిలా ఉండగా నిన్న బీఆర్ఎస్ బాస్, సీఎం కేసీఆర్ 115 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఇందులో ఏడుగురికి టికెట్లు ఇవ్వలేదు. భవిష్యత్తులో వారికి మంచి పదవులు ఇస్తానని ప్రకటించారు. పార్టీ అభ్యర్థులకు సహకరించి గెలిపించాలని సూచించారు.
Also Read : Ayutha Chandi Yagam : అయుత చండీ యాగం భక్తసందోహం