Meta Threads : మెటా థ్రెడ్స్ ఖుష్ కబర్
త్వరలో వెబ్ వెర్షన్
Meta Threads : మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ కు పోటీగా మెటా – ఫేస్ బుక్ సంస్థ తీసుకు వచ్చిన థ్రెడ్స్ దుమ్ము రేపుతోంది. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇప్పటి వరకు కేవలం మొబైల్ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. ప్రారంభించిన నాటి నుంచి నేటి దాకా సభ్యుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.
Meta Threads Updates
దీనిని దృష్టిలో పెట్టుకుని మెటా – ఫేస్ బుక్ సిఇఓ మార్క్ జుకర్ బర్గ్ సంచలన ప్రకటన చేశారు. నెటిజన్లకు ప్రత్యేకించి ఖుష్ కబర్ చెప్పారు. ఇక నుంచి మొబైల్ వెర్షన్ తో పాటు వెబ్ వెర్షన్ కూడా తీసుకు రానున్నట్లు వెల్లడించారు.
దీంతో నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా సరే ట్విట్టర్ ను పడగొట్టాలని ప్లాన్ చేశారు జుకర్ బర్గ్ . దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు ట్విట్టర్ సిఇఓ , టెస్లా చైర్మన్ ఎలోన్ మస్క్. మెటా తీసుకు వచ్చిన థ్రెడ్స్(Threads) లో ఏమీ లేదని, తమను చూసి మొత్తం కాపీ కొట్టారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
అంతే కాదు మెటా నిర్వాకంపై కోర్టుకు కూడా ఎక్కాడు. అయినా ఎక్కడా తగ్గడం లేదు మెటా – ఫేస్ బుక్ సిఇఓ మార్క్ జుకెర్ బర్గ్. మరో వైపు ఇప్పటి వరకు థ్రెడ్స్ కేవలం మొబైల్ వినియోగదారులకు మాత్రమే పరిమితం చేసింది. ఈ యాప్ అందులో మాత్రమే ఓపెన్ అవుతుంది.
ప్రస్తుతం ట్రెడ్స్ కు 10 మిలియన్ల మంది సభ్యులు ఉన్నారు. రాబోయే రోజుల్లో వెబ్ వెర్షన్ గనుక తీసుకు వస్తే భారీ ఎత్తున సభ్యులుగా చేరే ఛాన్స్ ఉందని జుకర్ బర్గ్ ఆలోచిస్తున్నారు. ఏది ఏమైనా టెక్నాలజీలో అప్ డేట్ కాక పోతే ఆగి పోతామని మెటాను చూస్తే తెలుస్తుంది.
Also Read : MLA Rathod Bapu Rao : బీఆర్ఎస్ ను వీడను ఏ పార్టీలో చేరను