Google CEO : అద్భుతం అపురూప స‌న్నివేశం

గూగుల్ సీఈవో సుంద‌ర్ పిచాయ్

Google CEO : చంద్ర‌యాన్ -3 విజ‌య‌వంతంగా చంద్రునిపై కాలు మోపింది. 140 కోట్ల భార‌తీయుల క‌ల‌ల‌ను నిజం చేసింద‌ని ఇందుకు తాను గ‌ర్వ ప‌డుతున్నాన‌ని పేర్కొన్నారు గూగుల్ సీఈవో సుంద‌ర్ పిచాయ్(Google CEO). గురువారం ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న స్పందించారు.

ఈ విజ‌యాన్ని నేను మాట‌ల్లో చెప్ప‌లేను. ప్ర‌పంచ దేశాలు విస్తు పోయేలా అద్భుతాన్ని సృష్టించింది ఇస్రో. మ‌న దేశం కూడా శాస్త్ర సాంకేతిక రంగాల‌లో అగ్ర‌గామిగా ఉంద‌ని ఈ సక్సెస్ తో రూఢీ అయ్యింద‌న్నారు సుంద‌ర్ పిచాయ్.

Google CEO Feels Proud

ప్ర‌తి భార‌తీయుడు ఆనంద ప‌డేలా, స‌గ‌ర్వంగా త‌ల ఎత్తుకునేలా చేసినందుకు భార‌త దేశ అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ చైర్మ‌న్ , శాస్త్ర‌వేత్త‌లు, సిబ్బందికి పేరు పేరునా అభినంద‌న‌లు తెలియ చేస్తున్నాన‌ని తెలిపారు సీఈవో.

ఇదిలా ఉండ‌గా నిన్న సాయంత్రం 6.04 గంట‌ల‌కు ల్యాండ‌ర్ జాబిల్లిపై కాలు మోపింది. భార‌త వైజ్ఞానిక స‌త్తాను ప్ర‌పంచానికి చాటి చెప్పింది. 15 ఏళ్ల కింద‌ట చంద్రుడిపై నీరు ఉంద‌ని తేల్చింది. విశ్వ ప‌రిశోధ‌న‌ల్లో కొత్త శ్వాస‌ను భార‌త్ నింపింది.

ఇప్పుడు చంద్ర‌యాన్-3తో జాబిలిపై ఎవ‌రూ వెళ్ల‌ని దారుల్లో వెళ్లింది. ఎవ‌రూ చూడ‌ని ద‌క్షిణ జాడ‌ల్ని ప్ర‌పంచానికి చూపించిందని ప్ర‌పంచ చ‌రిత్ర సృష్టించింద‌ని ప్ర‌ధాని మోదీ పేర్కొన్నారు.

Also Read : Chandrayan-3 Sand Art : చంద్ర‌యాన్-3 సైక‌త శిల్పం

Leave A Reply

Your Email Id will not be published!