Minister KTR : తెలంగాణలో కోకా కోలా యూనిట్
వెల్లడించిన ఐటీ మంత్రి కేటీఆర్
Minister KTR : తెలంగాణ ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ బిజీగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా దిగ్గజ కంపెనీల చైర్మన్లు, సిఇఓలు, ఇతర కీలక వ్యక్తులతో కలుస్తున్నారు. ప్రత్యేకించి తెలంగాణకు భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చేలా ప్రయత్నం చేస్తున్నారు.
Minister KTR in America for Investments
తాజాగా కీలక ప్రకటన చేశారు కేటీఆర్. అమెరికాకు చెందిన ప్రముఖ ఫైనాన్షియల్ కంపెనీ మెట్ లైఫ్ హైదరాబాద్ లో తన కేంద్రాన్ని ప్రారంభించనుందని వెల్లడించారు. శనివారం ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని మంత్రి పంచుకున్నారు.
మరో వైపు ఆసక్తికర విషయం తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మరో యూనిట్ ప్రారంభించేందుకు ప్రముఖ పానియాల తయారీ కంపెనీ కోకా కోలా సుముఖత వ్యక్తం చేసిందని కేటీఆర్(KTR) తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే సిద్దిపేట జిల్లాలో కోకా కోలా ప్లాంట్ ఏర్పాటై ఉంది. దీనికి అదనంగా రూ. 647 కోట్లు పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
యుఎస్ లోని న్యూయార్క్ నగరంలో మంత్రి కేటీఆర్ కోకా కోలా సంస్థ ఉపాధ్యక్షులు జేమ్స్ మేక్ గ్రివితో సమావేశం అయ్యారు. ఈ మేరకు వరంగల్ లేదా కరీంనగర్ ప్రాంతంలో తన రెండో నూతన తయారీ యూనిట్ ఏర్పాటుకు సంసిద్దత వ్యక్తం చేశారని తెలిపారు కేటీఆర్.
ఇప్పటి వరకు రాష్ట్రంలో కోకా కోలా సంస్థ రూ. 2,500 కోట్లు పెట్టుబడి పెట్టిందని పేర్కొన్నారు మంత్రి. కోకా సంస్థ చరిత్రలో ఇంత భారీ ఎత్తున ఇన్వెస్ట్ చేయడం ఇదే తొలిసారి అని స్పష్టం చేశారు.
Also Read : Gaddam Vivek : హస్తం వైపు ‘గడ్డం’ చూపు