Madurai Train Mishap : మధురై రైలు భోగీల్లో అగ్ని ప్రమాదం
9 మందికి పైగా మృతి 20 మందికి గాయాలు
Madurai Train Mishap : దేశంలో ఇటీవల రైలు ప్రమాదాలు వరుసగా కొనసాగుతున్నాయి. శనివారం మధురై రైలు బోగీల్లో(Madhurai Train Mashap) ఘోర అగ్న ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 9 మంది మరణించగా 20 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
మధురై నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్ కు సమీపంలో ఆగి ఉన్న ఆధ్యాత్మిక పర్యాటక రైలు బోగీలలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రైలు బోగీల్లో వంట చేస్తుండగా సిలిండర్ పేలినట్లు సమాచారం.
Madurai Train Mishap Viral
ఇదిలా ఉండగా గాలి వేగంతో రైలు కోచ్ లలో మంటలు చేలరేగాయి. వెంటనే అగ్ని మాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. లక్నో నుంచి టూరిస్ట్ ట్రైన్ బయలు దేరింది. రైలు కోచ్ లో ఉన్నట్టుండి మంటలు చెల రేగాయి.
15 రోజుల పర్యటన కోసం ఉత్తర ప్రదేశ్ లోని లక్నో నుంచి బయలు దేరింది ఈ ట్రైన్. మధురై రైల్వే స్టేషన్ సమీపంలో నిలిచి పోయింది . రైలులో మంటలు చెలరేగి కాలపోవడంతో తీవ్రంగా ప్రయాణికులు గాయపడినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
విషయం తెలిసిన వెంటనే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్షవ్ ప్రమాదం గురించి ఆరా తీశారు. బాధితులకు అండగా నిలవాలని ఆదేశించారు. మరో వైపు మదురై రైలు బోగీలలో చోటు చేసుకున్న ఘోర అగ్ని ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియ చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.
Also Read : Minister KTR : తెలంగాణలో కోకా కోలా యూనిట్