Minister KTR : అమెరికాలో కేటీఆర్ హల్ చల్
చికాగోలో మంత్రి బిజీ బిజీ
Minister KTR : ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో ఫుల్ బిజీగా ఉన్నారు. పలు కంపెనీలతో ఆయన చర్చలు జరుపుతున్నారు. ఆయన వెంట వెళ్లిన బృందం కేటీఆర్(Minister KTR) కు సహాయకారిగా ఉంది. దిగ్గజ కంపెనీలన్నీ ఇప్పటికే హైదరాబాద్ ను ఎంచుకున్నాయి. మరికొన్ని ఫోకస్ పెట్టాయి. కారణం ఇక్కడ కొలువు తీరిన ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు, బడా బాబులకు, కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ఉండడం.
Minister KTR Getting Huge Investments
మరో వైపు పారిశ్రామిక పాలసీ విధానంలో కీలక మార్పులు తీసుకు రావడంతో ఆయా కంపెనీలు హైదరాబాద్ ను ఎంచుకుంటున్నాడయి. ఇక్కడ భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. దీని వెనుక మంత్రి కేటీఆర్ కృషి ఉందని చెప్పక తప్పదు.
ఆయన ఎక్కడికి వెళ్లినా హైదరాబాద్ గురించి, ఇక్కడ కల్పిస్తున్న వసతుల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. డైనమిక్ లీడర్ షిప్ కలిగి ఉండడం, భవిష్యత్తులో రాష్ట్రానికి ఏం కావాలనే దానిపై అవగాహన ఉండడం కూడా కలిసి వచ్చిందనే చెప్పక తప్పదు.
ఇప్పటికే ప్రముఖ పానియాల కంపెనీ కోకా కోలా తెలంగాణలో యూనిట్ ను ఏర్పాటు చేసింది. తాజాగా మరో కొత్త యూనిట్ ను వరంగల్ లేదా కరీంనగర్ లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. మెట్ లైఫ్ , ఫుడ్ ప్రాసెసింగ్ కు సంబంధించి మరో దిగ్గజ కంపెనీ కేటీఆర్ కు హామీ ఇచ్చింది. తాజాగా కేటీఆర్ చికాగోలో ప్రయాణం చేస్తుండగా తీసిన ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Also Read : Balka Suman : కాంగ్రెస్ లోకి కోవర్ట్ లను పంపాం