MLA Raja Singh : తెలంగాణ‌ను హిందూ రాష్ట్రం చేస్తా

ఎమ్మెల్యే రాజా సింగ్ కామెంట్స్

MLA Raja Singh : భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న ల‌క్ష్యం ఒక్క‌టేన‌ని అది తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా హిందూ రాష్ట్రంగా చేయ‌డం త‌న అంతిమ ల‌క్ష్య‌మ‌ని ప్ర‌క‌టించారు. మంగ‌ళ‌వారం రాజా సింగ్ మీడియాతో మాట్లాడారు.

MLA Raja Singh Comment

వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ టికెట్ ఇవ్వ‌క పోయినా తాను ఫీల్ కానన్నారు. ఒక‌వేళ ఇస్తే పోటీ చేస్తా లేదంటే రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని స్ప‌ష్టం చేశారు. టికెట్ ఇవ్వ‌క పోయినంత మాత్రాన తాను భ‌య‌ప‌డేది లేద‌న్నారు. కానీ పార్టీకి వ్య‌తిరేకంగా తాను స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేయబోనంటూ ప్ర‌క‌టించారు.

ప్రాణ‌మైనా వ‌దులుకుంటాను కానీ భార‌త రాష్ట్ర స‌మితి , కాంగ్రెస్ పార్టీ లాంటి సెక్యూల‌ర్ పార్టీలలో తాను చేర‌బోనంటూ చెప్పారు ఎమ్మెల్యే రాజా సింగ్(MLA Raja Singh). ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

స‌ద‌రు ఎమ్మెల్యే వివాదాస్ప‌ద కామెంట్స్ చేయ‌డంతో భ‌గ్గుమంటున్నారు. కోరి తెచ్చుకున్న తెలాంగాణ రాస్ట్రాన్ని ఎలా హిందూ రాష్ట్రంగా మారుస్తారో ఎమ్మెల్యే రాజా సింగ్ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. గ‌తంలో సీరియ‌స్ కామెంట్స్ చేయ‌డంతో రాజా సింగ్ పై టాడా చ‌ట్టం ప్ర‌యోగించారు. ఆయ‌న జైలు పాల‌య్యారు. ఇటీవ‌లే విడుద‌ల‌య్యారు.

ఎలాంటి కాంట్రోవెర్షియ‌ల్ కామెంట్స్ చేయొద్దంటూ కోర్టు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చింది. అయినా రాజా సింగ్ మాట తీరులో మార్పు రాక పోవ‌డం విశేషం.

Also Read : Bethi Subhash Reddy : సీఎం నిర్ణ‌యం ఎమ్మెల్యే ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!