India Fight : మోదీ ప్ర‌భుత్వం పై ఇండియా యుద్దం

పాల‌న అస్త‌వ్య‌స్తం దేశానికి శాపం

India Fight : ప్ర‌తిప‌క్షాల‌తో కూడిన భార‌త (ఇండియా) కూట‌మి నిప్పులు చెరిగింది. దేశంలో కొలువు తీరిన మోదీ భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ స‌ర్కార్ ప్ర‌జ‌ల పాలిట శాపంగా మారింద‌ని పేర్కొంది. రాబోయే రోజుల్లో మోదీకి పుట్ట గ‌తులు ఉండ‌వ‌ని హెచ్చ‌రించింది.

India Fight Viral

దేశంలోని ప్ర‌ధాన సంస్థ‌ల‌ను కావాల‌ని నిర్వీర్యం చేశార‌ని, బ‌డా వ్యాపార‌వేత్త‌ల‌కు, కార్పొరేట్ కంపెనీల‌కు మేలు చేకూర్చేలా చేశారంటూ ఆరోపించింది. ప్ర‌జ‌లు ఎన్న‌టికీ హ‌ర్షించ‌ర‌ని హిత‌వు ప‌లికింది. ఇప్ప‌టికే ఆదాయంలో ఉన్న ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను గంప గుత్త‌గా త‌న అనుయాయుల‌కు అప్ప‌గించారంటూ మోదీపై నిప్పులు చెరిగింది ఇండియా కూట‌మి.

వ‌చ్చే ఏడాది దేశ వ్యాప్తంగా జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఇండియా కూట‌మి స‌త్తా చాట‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పింది. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ద్ర‌వ్యోల్బ‌ణం పెరిగింద‌ని , నిరుద్యోగం ఊహించ‌ని రీతిలో భారంగా మారింద‌ని అయినా మోదీ(PM Modi) స్పందించ‌డం లేద‌ని ఆరోపించింది.

డిజిట‌లైజేష‌న్ పేరుతో దేశ ప్ర‌జ‌ల‌ను మభ్య పెడుతూ మోసానికి పాల్ప‌డుతున్నారంటూ ధ్వ‌జ‌మెత్తింది ఇండియా కూట‌మి. జ‌నం సంక్షేమం కోసం మోదీ ప్ర‌భుత్వంపై ఇండియా కూట‌మి యుద్దం చేస్తుంద‌ని ప్ర‌క‌టించింది.

Also Read : Sarpanch Navya : ఛాన్స్ ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తా

Leave A Reply

Your Email Id will not be published!