Udayanidhi Stalin : సనాతన ధర్మం అత్యంత ప్రమాదం
భగ్గుమన్న బీజేపీ చీఫ్ అన్నామలై
Udayanidhi Stalin : తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తనయుడు, నటుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. సనాతన ధర్మం అనేది డెంగ్యూ, మలేరియా వ్యాధి లాంటిదని పేర్కొన్నారు. దీనిపై భగ్గుమంటున్నాయి హిందూ సంస్థలు. బీజేపీ చీఫ్ కె. అన్నామలై నిప్పులు చెరిగారు ఉదయనిధిపై.
Udayanidhi Stalin Comments Viral
తాజాగా చెన్నై వేదికగా జరిగిన రచయితల సదస్సులో ఉదయనిధి స్టాలిన్(Udayanidhi Stalin) హాజరయ్యారు. సనాతన ధర్మం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సనతాన ధర్మం సామాజిక న్యాయానికి పూర్తిగా విరుద్దమన్నారు. దానిని నిర్మూలించాలని పిలుపునిచ్చారు. దానిని వ్యతిరేకించ కూడదు..కానీ పూర్తిగా లేకుండా చేయాలని స్పష్టం చేశారు ఉదయనిధి స్టాలిన్.
హిందువులకు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రిపై వెంటనే కేసు నమోదు చేయాలని పిలుపునిచ్చారు హిందు సంఘాల నేతలు, బీజేపీ చీఫ్. ఇదిలా ఉండగా బీజేపీ ఐటీ ప్రతినిధి అమిత్ మాల్వియా నిప్పులు చెరిగారు. రాహుల్ మొహబ్బత్ కీ దుకాన్ గురించి ప్రస్తావిస్తున్నారు.
డీఎంకే వారసుడు సనాతన ధర్మాన్ని ఎద్దేవా చేస్తున్నారు. వీళ్లు పవర్ లోకి వస్తే మొత్తంగా హిందువులను నామ రూపాలు లేకుండా చేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. తాను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉంటానని ప్రకటించారు మంత్రి ఉదయనిధి స్టాలిన్.
Also Read : G Seetha Ranjith Reddy : సామాన్య భక్తులకు సేవలందిస్తా