Sandra Venkata Veeraiah : ‘సండ్ర’ సింప్లిసిటీకి జనం ఫిదా
ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్యే
Sandra Venkata Veeraiah : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలోని సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఇప్పుడు వైరల్ గా మారారు. ఆయన నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నారు. కారణం ఏమిటంటే నిత్యం ప్రజల మధ్యనే ఉండటం. వారి సమస్యలను తెలుసు కోవడం.
Sandra Venkata Veeraiah Working Style
తాజాగా పని నిమిత్తం హైదరాబాద్ కు వచ్చారు ఎమ్మెల్యే. సచివాలయం వద్ద తన వద్దకు వచ్చిన వారి వినతులను స్వీకరిస్తున్నారు. అంతే కాదు తానే స్వయంగా దరఖాస్తు రాస్తున్నారు. ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో విక్టరీ సాధించారు సండ్ర వెంకట వీరయ్య(Sandra Venkata Veeraiah). ఆయన ఏకంగా నాలుగుసార్లు శాసన సభ్యుడిగా విజయం సాధించారు.
ప్రదేశం ఏదైనా సరే తన కోసం వచ్చే వారికి సంబంధించి ఏ సమస్య ఉన్నా వింటారు. తనకు చేతనైతే సాయం చేస్తారు. లేదంటే దాని పరిష్కారం కోసం వారి వెంట వస్తారు. బాధితులకు భరోసా ఇస్తారు. అండగా ఉంటానని హామీ ఇస్తారు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య.
ఇవాళ సర్పంచ్ అయితేనే రువాబు చెలాయించే ప్రస్తుత తరుణంలో కేవలం సింప్లిసిటీకి ప్రయారిటీ ఇచ్చే ఎమ్మెల్యేలు ఉండడం ప్రజల అదృష్టం అని చెప్పక తప్పదు. సెక్రటేరియేట్ కు వెళుతున్న సమయంలో గ్రామస్తులు తారసపడ్డారు. వారి కోరిక మేరకు తానే కూర్చుని రాసుకుంటూ కనిపించారు. ఇప్పుడు ఈ ఫోటో అందరినీ ఆకట్టుకుంటోంది.
Also Read : Tirumala : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.51 కోట్లు