RK Roja Selvamani : దుర్గమ్మ సన్నిధిలో రోజా
ఆలయ అర్చకుల ఆశీర్వాదం
RK Roja Selvamani : విజయవాడ – ఏపీ రాష్ట్ర పర్యాటక , సాంస్కృతిక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి గురువారం బెజవాడలో కొలువు తీరిన ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆమెకు సాదర స్వాగతం పలికారు ఆయల కమిటీ చైర్మన్ , సభ్యులు.
RK Roja Selvamani Visit Kanaka Durga Temple
ఈ సందర్భంగా అమ్మ వారికి పూజలు చేపట్టారు. అర్చకులు ఆర్కే రోజా సెల్వమణికి ఆశీర్వచనాలు అందజేశారు. అమ్మ వారి ప్రసాదాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రాంబాబు, ఈవో, ప్రధాన అర్చకులు పాల్గొన్నారు. అనంతరం కృష్ణా జిల్లా ఇంఛార్జ్ మంత్రిగా ఉన్న రోజా(RK Roja Selvamani) పెనమలూరు నియోజకవర్గ స్థాయి సమీక్ష చేపట్టారు.
ప్రభుత్వ పరంగా అన్ని శాఖల ప్రగతిపై సమీక్షించారు. వీలైనంత త్వరలో తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించాలని మంత్రి ఆర్కే రోజా ఆదేశించారు. ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు. ఎమ్మెల్యే పార్థసారథి పాల్గొన్నారు.
ఇదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఆర్కే రోజా సెల్వమణి. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఐటీ నోటీసులు అందుకున్న చంద్రబాబు అరెస్ట్ కావడం ఖాయమని జోష్యం చెప్పారు.
ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. నిన్నటి దాకా వ్యవస్థలను మ్యానేజ్ చేస్తూ వచ్చిన బాబు ఏం ముఖం పెట్టుకుని ఏపీలో పర్యటిస్తారంటూ ప్రశ్నించారు ఆర్కే రోజా.
Also Read : Nadendla Manohar : అగ్రీగోల్డ్ బాధితులకు అందని న్యాయం