Tirumala Rush : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.17 కోట్లు
శ్రీనివాసుడిని దర్శించుకున్న భక్తులు 66,199
Tirumala Rush : తిరుమల – పుణ్య క్షేత్రం తిరుమల భక్తులతో కిటకిట లాడుతోంది. ప్రతి రోజూ భక్తుల రద్దీ పెరుగుతోంది. నిన్న శ్రీవారిని 66 వేల 199 మంది భక్తులు దర్శించుకున్నారు. 29 వేల 351 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.
Tirumala Rush With Devotees
భక్తులు నిత్యం సమర్పించుకునే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.17 కోట్లు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించింది. సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్న భక్త బాంధవులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది.
ఎక్కడా రాజీ పడడం లేదని స్పష్టం చేశారు టీటీడీ ఏవో ఏవీ ధర్మారెడ్డి. ఇదిలా ఉండగా తిరుమల లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం 18 గంటలకు పైగా వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
తిరుమలలో టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్రం, దేశం బాగుండాలని కోరుతూ వరుణ యాగం చేపట్టిందని తెలిపారు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. సామాన్యులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందన్నారు. ఎక్కడా రాజీ పడే ప్రసక్తి లేదన్నారు.
లోక కళ్యాణం కోసం , ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వరుణ యాగం చేపట్టడం జరిగిందని చెప్పారు టీటీడీ చైర్మన్.
Also Read : Balakrishna : మా బావ అరెస్ట్ అక్రమం – బాలయ్య