NASSCOM : హైదరాబాద్ అద్భుత నగరం
నాస్కామ్ నివేదికలో టాప్
NASSCOM : నాస్కామ్ – తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అరుదైన ఘనత సాధించింది. తాజాగా నాస్కామ్ , గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (జీసీసీ) కు సంబంధించి ఈ నగరం అద్భుతమైన సిటీగా పేర్కొంది. తాజాగా నాస్కామ్ నివేదిక వెల్లడించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా తెలిపింది.
NASSCOM Declares Hyderabad Best City
భారత దేశంలో అత్యంత వేగవంతంగా , సౌకర్యవంతంగా ముందుకు సాగుతున్న నగరం ఏదైనా ఉందంటే అది కేవలం హైదరాబాద్ మాత్రమేనేనని స్పష్టం చేసింది. జీసీసీల కోసం ఎక్కువగా కోరుకునే గమ్యస్థానంగా ఉందని పేర్కొంది.
ఏడు కొత్త జీసీసీలు ఏర్పాటు అయ్యాయి. 2023 తొలి త్రైమాసికంలో 4 కంపెనీలు హైదరాబాద్ లో విస్తరించాయి. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(KTR) ఇటీవల విదేశీ పర్యటించారు. అమెరికాతో పాటు దుబాయ్ లో పర్యటించారు. దిగ్గజ కంపెనీలు ఎక్కువగా హైదరాబాద్ ను ఎంచుకున్నాయని తెలిపింది నాస్కామ్.
క్యూ1 2023లో కొత్తగా జీసీసీలు ఏర్పాటు చేసినవి హైదరాబాద్ లో ఉండడం విశేషం. వాటిలో బ్లాక్ బెర్రీ, సైబర్ ఆర్క్ , అలైన్ టెక్నాలజీ, మాండీ హోల్డింగ్స్ , లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ , ఓమ్నీ డిజైన్ , బ్రిస్టల్ మైయర్స్ స్క్విబ్, లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూప్, టెక్నిప్ ఎఫ్ఎంసీ ఉన్నాయని స్పష్టం చేసింది నాస్కామ్.
Also Read : AP CID Counter : పీవీ రమేష్ కామెంట్స్ సీఐడీ సీరియస్