Sonia Gandhi : తెలంగాణ మహిళలకు సోనియా నజరానా
ప్రతి నెలా రూ. 2,500
Sonia Gandhi : హైదరాబాద్ – రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం విజయ భేరి సభను నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి అశేషంగా జనం తరలి వచ్చారు. సభా ప్రాంగణం పూర్తిగా నిండి పోయింది.
Sonia Gandhi Speech
లక్షలాది మంది ప్రజలను ఉద్దేశించి ఏఐసీసీ మాజీ చీఫ్ , సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీ పథకాలను ప్రకటించారు. ఇందులో భాగంగా మహళలకు తీపి కబురు చెప్పారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెలా రూ. 2,500 పెన్షన్ కింద ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా ప్రతి కుటుంబం నిత్యం ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ను ఇక నుంచి రూ.500లకే ఇస్తామని స్పష్టం చేశారు సోనియా గాంధీ(Sonia Gandhi). రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు .
తమ పార్టీ ఆధ్వర్యంలో కర్ణాటకలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం జరిగిందని, తెలంగాణలో తాము పవర్ లోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామన్నారు. రైతులకు భరోసా ఇవ్వనున్నట్లు ప్రకటించారు ఏఐసీసీ చీఫ్ మల్లిఆకర్జున్ ఖర్గే.
Also Read : Congress 2024 Comment : కాంగ్రెస్ ఫోకస్ కానుందా సక్సెస్