Indian New Parliament : భారత పార్లమెంట్ కు కొత్త పేరు
పార్లమెంట్ హౌస్ ఆఫ్ ఇండియా
Indian New Parliament : న్యూఢిల్లీ – కేంద్రంలో కొలువు తీరిన మోదీ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భారత పార్లమెంట్ భవనం ఇప్పటికే పూర్తయింది. ఎంతో అంగరంగ వైభవోపేతంగా దీనిని ప్రారంభించారు. అత్యున్నతమైన సాంకేతిక నైపుణ్యం, ఆధునికమైన రీతిలో కట్టారు.
Indian New Parliament New Name
తాజాగా పార్లమెంట్ లోని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా(Om Birla) మంగళవారం కీలక ప్రకటన చేశారు. కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనానికి పార్లమెంట్ హౌస్ ఆఫ్ ఇండియా అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. ఇవాళ్టి నుండి పార్లమెంట్ కొత్త భవనంలోనే సమావేశాలు జరుగుతాయని స్పష్టం చేశారు స్పీకర్.
ఈ భవనం దేశ రాజధాని న్యూ ఢిల్లీ లోని రఫీ మార్గ్ 118 వీధిలో ఉంది. పార్లమెంట్ నూతన భవన నిర్మాణం అక్టోబర్ 1, 2020లో ప్రారంభమైంది. సెప్టెంబర్ 19, 2023న మంగళవారం తెరుచుకుంది. ఇందులో నాలుగు అంతస్తులు ఉన్నాయి. దీనిని టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీ నిర్మించింది.
ఇందులో సిట్టింగ్ కెపాసిటీ మొత్తం 1,272. లోక్ సభకు సంబంధించి 888, రాజ్యసభకు సంబంధించి 384 మంది కూర్చునేందుకు వీలుండేలా నిర్మించారు. కొత్త సొబగులతో నిర్మించిన ఈ అద్భుత భవనాన్ని మే 28న ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ ప్రారంభించారు.
Also Read : Chandrababu Naidu Arrest : చంద్రబాబు బెయిల్ పై విచారణ