Asaduddin Owaisi : థర్డ్ ఫ్రంట్ కు కెప్టెన్ గా కేసీఆర్ బెటర్
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ
Asaduddin Owaisi : హైదరాబాద్ – ఎంఐఎంచీఫ్ అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ సర్కార్ కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ కలిసి 28 పార్టీలతో ఇండియా కూటమిగా ఏర్పాటయ్యాయి. ఇందులో బీఎస్పీ చీఫ్ మాయావతి, భారత రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్ మాత్రం దూరంగా ఉన్నారు.
Asaduddin Owaisi Comments Viral
గతంలో బీజేపీకి వ్యతిరేకంగా ఫ్రంట్ కడతానంటూ కాళ్లకు బలపం కట్టుకుని తిరిగారు కేసీఆర్. ఆయన కర్ణాటకకు వెళ్లారు. అక్కడ దేవెగౌడను కలిశారు. తమిళనాడులో ఎంకే స్టాలిన్ , పశ్చిమ బెంగాల్ లో సీఎం మమతా బెనర్జీని, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ను, పంజాబ్ లో భగవంత్ మాన్ ను, మహారాష్ట్రంలో ఎన్సీపీ చీఫ్ పవార్, శివసేన బాల్ థాక్రే పార్టీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రేను, జార్ఖండ్ లో సీఎం హేమంత్ సోరేన్ ను, బీహార్ లో సీఎం నితీశ్ కుమార్ ను కలుసుకున్నారు.
కానీ ఎక్కడా సీఎం కేసీఆర్ ను నమ్మలేదు. ఆయన అవకాశ వాద రాజకీయాలకు పాల్పడుతున్నాడని కాంగ్రెస్ ఆరోపించింది. మిగతా పార్టీలు కూడా కేసీఆర్ ను అనుమానంగా చూశాయి. కేసీఆర్ పైకి మోదీని తిడుతున్నట్లు అనిపించినా లోలోపట మోదీకి సపోర్ట్ చేస్తున్నాడంటూ ఆరోపించాయి. ఈ తరుణంలో తెరపైకి మూడో ఫ్రంట్ తెర పైకి వచ్చింది. ఈ ఫ్రంట్ కు సీఎం కేసీఆర్ అయితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
Also Read : Jio Air Fiber Launch : జియో ఎయిర్ ఫైబర్ ప్రారంభం