Chandra Babu Naidu : చంద్రబాబు బయటకు వచ్చేనా
సీఐడీ కస్టడీనా లేక రిమాండ్ పొడగింపా
Chandra Babu Naidu : రాజమండ్రి – ఏపీ స్కిల్ స్కాంలో కీలక ఆరోపణలు ఎదుర్కొంటూ రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న నారా చంద్రబాబు నాయుడు పరిస్థితి దారుణంగా తయారైంది. 45 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబుకు ఏపీ సీఐడీ కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఆయనను నంద్యాలలో అదుపులోకి తీసుకుంది. 10 గంటలకు పైగా ప్రశ్నించింది. 20 ప్రశ్నలు సంధించింది. ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు.
Chandra Babu Naidu Issue Viral
దీంతో నారా చంద్రబాబు నాయుడును(Chandra Babu Naidu) ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టింది. సుదీర్ఘ వాదోపవాదనలు విన్న అనంతరం జడ్జి బీఎస్వీ హిమ బిందు సంచలన తీర్పు వెలువరించింది. 14 రోజుల కస్టడీకి విధించింది. దీనిని సవాల్ చేస్తూ చంద్రబాబు నాయుడు తరపు లాయర్లు హైకోర్టులో క్వాష్ పిటిషన్ , బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
శుక్రవారం కీలక తీర్పు వెలువరించనుంది. సీఐడీ కస్టడీనా లేక రిమాండ్ పొడగింపా అనేది తేలనుంది. మరో వైపు చంద్రబాబుకు కష్టాలు తప్పేటట్టు లేవు. రోజు రోజుకు బయటకు వస్తారనే ధీమా సన్నగిల్లుతోంది.
ఒకదాని వెంట మరొకటిగా కేసులు వెంటాడుతున్నాయి. ఇవాళ ఏపీ హైకోర్టు , ఏసీబీ కోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. సుదీర్ఘ వాదనలు కొనసాగుతున్నాయి. కస్టడీ కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై ఏసీబీ కోర్టు తీర్పు వాయిదా వేసింది. నిన్ననే తీర్పు రావాల్సి ఉండగా ఇవాళ్టికి వాయిదా పడింది.
Also Read : Undavalli Arun Kumar : చంద్రబాబుపై ఉండవల్లి పిల్