AP High Court : హైకోర్టులో బాబుకు చుక్కెదురు
క్వాష్ పిటిషన్ కొట్టేసిన ధర్మాసనం
AP High Court : అమరావతి – ఏపీ స్కిల్ స్కామ్ లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడి పరిస్థితి రెండికి చెడ్డ రేవడిలా అన్న చందంగా తయారైంది. ఏపీ సీఐడీ కోలుకోలేని షాక్ తగిలింది అటు ఏసీబీ కోర్టులో ఇటు హైకోర్టులో చుక్కెదురైంది.
AP High Court Shocking Decision
చంద్రబాబు నాయుడు తరపున సుప్రీంకోర్టులో పేరు పొందిన లాయార్లు వాదించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. స్కామ్ లో ఏకంగా రూ. 371 కోట్లు కొల్లగొట్టారంటూ ఆరోపించింది. ఇందుకు సంబంధించి 10 గంటలకు పైగా విచారించింది. ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. జడ్జి హిమ బిందు కోలుకోలేని ఝలక్ ఇచ్చింది. 14 రోజుల రిమాండ్ విధించింది.
శుక్రవారం ఏసీబీ కోర్టులో తిరిగి విచారణ చేపట్టింది. రిమాండ్ ను 2 రోజుల పాటు పొడిగించింది. ఇదే సమయంలో కస్టడీకి చంద్రబాబు నాయుడును(Chandrababu Naidu) ఇస్తూ తీర్పు చెప్పింది. ఇదే సమయంలో బాబు తరపున క్వాష్ పిటిషన్ తో పాటు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టులో.
దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఇందులో ఎలాంటి ఆధారాలు సమర్పించ లేక పోయారని భావిస్తున్నట్లు క్వాష్ పిటిషన్ కొట్టివేస్తూ తీర్పు చెప్పింది హైకోర్టు. ఇది కూడా బిగ్ షాకేనని చెప్పక తప్పదు.
Also Read : Chandrababu Naidu ACB Court : రెండు రోజుల కస్టడీకి చంద్రబాబు