Buggana Rajendranath Reddy : దోచుకున్నోడికి జైలే గతి
బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి
Buggana Rajendranath Reddy : ఏపీ స్కిల్ స్కీమ్ స్కామ్ లో అడ్డంగా బుక్కైన మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తప్పు చేసినందు వల్లనే రాజమండ్రి జైలులో ఉన్నారంటూ స్పష్టం చేశారు ఏపీ ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవహారాలు , నైపుణ్యాభివృద్ది, శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి(Buggana Rajendranath Reddy). శుక్రవారం ఏపీ అసెంబ్లీ సమావేశాలలో కీలక వ్యాఖ్యలు చేశారు.
Buggana Rajendranath Reddy Shocking Comments on Chandrababu
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 371 కోట్లు కొల్లగొట్టారంటూ ఆరోపించారు. ఎంచుకున్న ప్రైవేట్ మనుషుల్ని స్కిల్ కార్పొరేషణ్ లో పదవులు ఇచ్చి కూర్చోబెట్టారని పేర్కొన్నారు. ఏదైనా కార్పొరేషన్ ను స్థాపించాలంటే కేబినెట్ అప్రూవల్ అన్నది ముఖ్యమని స్పష్టంచేశారు బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి.
ప్రభుత్వ రూల్స్ రెగ్యులేషన్స్ ను పూర్తిగా పక్కన పెట్టేశారంటూ మండిపడ్డారు మంత్రి. రూ. 371 కోట్లను చూడవద్దని రూ. 3,281 కోట్లకు పైగా డబ్బులు కొల్లగొట్టారంటూ చంద్రబాబు నాయుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీమెన్స్ సంస్థ వాటాగా 90 శాతానికి సంబంధించి ఆ నిధులు ఎక్కడున్నాయో ఆనాటి సర్కార్ చెప్పాలని డిమాండ్ చేశారు.
జీవో నంబర్ 4 ప్రకారం, క్లస్టర్ ఏర్పాటుకు రూ.546.84 కోట్లు ఖర్చయ్యే నేపథ్యంలో 6 క్లస్టర్ల ఏర్పాటుకు మార్గదర్శకాలు ఇచ్చారని తెలిపారు. అమలులో ఏదీ మంజూరు కాలేదని పేర్కొన్నారు బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి.
Also Read : AP High Court : హైకోర్టులో బాబుకు చుక్కెదురు