Revanth Reddy : హైదరాబాద్ – తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి చీఫ్ గా ఉన్నప్పటికీ ఆయన తన పాత జ్ఞాపకాలను మరిచి పోవడం లేదు. గతంలో జెడ్పీటీసీగా ఉన్న రేవంత్ రెడ్డి తొలుత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. కోడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ఓటమి పాలయ్యారు. ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎంపీగా గెలిచారు. చివరకు టీపీసీసీ చీఫ్ గా ఎంపికయ్యారు.
Revanth Reddy Comments Viral
రేవంత్ రెడ్డికి గతంలో వెన్ను దన్నుగా నిలిచారు చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం ఏపీ స్కిల్ స్కాంలో బాబు అడ్డంగా ఇరుక్కున్నారు. ఆయన ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఊచలు లెక్క బెడుతున్నారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి(Revanth Reddy) షాకింగ్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది ఒక రాష్ట్రానికి పరిమితమైన వ్యక్తి కాదన్నారు. చంద్రబాబు జాతీయ స్థాయిలో ప్రభావం చూపించిన నాయకుడని పేర్కొన్నారు.
బాబుకు నిరసన తెలిపితే మద్దతు ఇవ్వాల్సింది పోయి అడ్డుకుంటే ఎలా అని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన కమ్మ వారి ఓట్లు కావాలి తప్ప వారు మద్దతు ఇస్తే తప్పు ఎలా అవుతుందన్నారు రేవంత్ రెడ్డి.
Also Read : Pakitsan Team Arrives : హైదరాబాద్ కు చేరుకున్న పాక్ టీమ్