Tirumala Hundi : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.98 కోట్లు
స్వామి వారిని దర్శించుకున్న భక్తులు 54,620
Tirumala Hundi : తిరుమల – ప్రసిద్దమైన పుణ్య క్షేత్రం కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో భక్తుల రద్దీ యధావిధిగా కొనసాగుతోంది. భారీ ఎత్తున తరలి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏర్పాట్లు చేస్తోంది. ప్రత్యేకించి దర్శన భాగ్యం కల్పించేందుకు చర్యలు చేపట్టింది.
Tirumala Hundi Updates
తాజాగా శ్రీనివాసుడిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 54 వేల 620కి చేరింది. 24 వేల 243 మంది మంది భక్తులు స్వామి వారికి తమ తలనీలాలు సమర్పించారు. నిత్యం శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలకు భక్తులు సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా హుండీ ఆదాయం రూ. 2.98 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) వెల్లడించింది.
ఇక స్వామి వారి దర్శనం కోసం తిరుమల లోని శిలా తోరణం దాకా వేచి ఉన్నారు. ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కనీసం 30 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.
ఇటీవల తిరుమలలోని శ్రీావారి మెట్లు, అలిపిరి మెట్ల వద్ద చిరుతల సంచారం ఉండడంతో టీటీడీ చర్యలు చేపట్టింది. ఈ మేరకు అటవీ శాఖ సూచనతో నడక దారుల్లో వచ్చే భక్త బాంధవులకు రక్షణ కవచంగా ఉండేందుకు గాను చేతి కర్రలను ఇస్తున్నట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.
Also Read : MS Swaminathan Comment : మహనీయుడు హరిత పితామహుడు