AP CID Summons : మాజీ మంత్రి నారాయణకు సమన్లు
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డ్ స్కాం
AP CID Summons : అమరావతి – మాజీ మంత్రి , నారాయణ విద్యా సంస్థల చైర్మన్ కొనకళ్ల నారాయణకు కోలుకోలేని షాక్ తగిలింది. ఇప్పటికే తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఏపీ సీఐడీ కీలక ప్రకటన చేసింది. అమరావతి రింగ్ రోడ్డు ఎలైన్మెంట్ స్కాం కేసులో ఎ14గా టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన తనయుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలో ఉన్న ఆయనకు ఆఫీసర్స్ నోటీసులు అందజేశారు.
AP CID Summons to EX-Minister
తాజాగా ఇదే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్మెంట్ స్కాం కేసులో కీలకమైన పాత్ర పోషించారంటూ ఇప్పటికే ప్రకటించింది ఏపీ సీఐడీ. ఇందుకు సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు మాజీ మంత్రి నారాయణకు ఈ కేసు స్కాంకు సంబంధించి సమన్లు జారీ చేసినట్లు ఏపీ సీఐడీ సోమవారం ప్రకటించింది.
దీంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలక నేతల్లో గుబులు మొదలైంది. ఇదిలా ఉండగా తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, ఏపీ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ కావాలని తమను వేధింపులకు గురి చేస్తోందంటూ ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిందని వాపోయారు. ఈ తరుణంలో సమన్లు రావడంతో అటు లోకేష్ ఇటు నారాయణ జైలుకు వెళ్లక తప్పదేమోనని ఆందోళన నెలకొంది.
Also Read : AP Govt Announce : ఏపీలో 14 నుంచి దసరా సెలవులు