Minister KTR : ఐటీ టవర్ తో 50 వేల మందికి ఉపాధి
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్
Minister KTR : హైదరాబాద్ – దేశంలోనే ఐటీ పరంగా తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ పొజిషన్ లో ఉందన్నారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. సోమవారం హైదరాబాద్ లోని మలక్ పేటలో నూతనంగా నిర్మించ బోయే ఐటీ టవర్ కు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ఎంఐఎం చీఫ్ , హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
Minister KTR Comment
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్(Minister KTR) ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రతి చోటా ఐటీ టవర్లు, ఐటీ హబ్ లు ఏర్పాటు చేయాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. దీని వల్ల చదువుకున్న వారికి పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు కేటీఆర్.
ప్రస్తుతమే కాదు రాబోయే కాలమంతా ఐటీ పైనే ఆధారపడి ఉంటాయని అందుకే తాము ఎక్కువగా ఈ రంగంపై ఫోకస్ పెట్టామన్నారు. ఇవాళ తెలంగాణ అన్ని రంగాలలో ముందంజలో ఉందన్నారు మంత్రి. ప్రస్తుతం 10 ఎకరాల విస్తీర్ణంలో 20 లక్షల చదరపు అడుగులతో ఐటీ టవర్ ను నిర్మించనున్నట్లు తెలిపారు. ఇందులో మొత్తం 21 అంతస్తులు ఉంటాయని చెప్పారు కేటీఆర్.
ఐటీ టవర్ నిర్మాణం వల్ల దాదాపు 50 వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు కలుగుతాయని స్పష్టం చేశారు మంత్రి. ఐటీ ఎగుమతుల్లో 26.14 శాతం వృద్ది సాధించిందని చెప్పారు మంత్రి.
Also Read : KTR IT Tower : తెలంగాణలో ఐటీ విప్లవం