Mahatma Gandhi Comment : మహనీయుడు మహాత్ముడు
గాంధీ జీవితం స్పూర్తిదాయకం
Mahatma Gandhi Comment : ఈ పవిత్రమైన మట్టిపై పుట్టిన మహనీయుడు మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ. హింసకు ప్రత్యామ్నాయమే లేదని అనుకున్న తరుణంలో శాంతి అనే ఆయుధాన్ని , అహింస అనే చేతికర్రను ఇచ్చిన గొప్ప మానవుడు. కోట్లాది మంది ప్రజలను ఇంకా ప్రభావితం చేస్తూనే ఉన్నారు. ఇంకా చేస్తూనే ఉంటారు కూడా. కారణం ఎలాంటి విద్వేషాలు లేని సమాజం కోసం ఆయన పరితపించారు. చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేక పోతే అది జీవితం కాదని, దానికి పరమార్థం ఉండదని ఆచరించి చూపించారు గాంధీ. కోట్లాది ప్రజలను ప్రభావితం చేస్తూనే ఉండడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుందని ఎందరో సెర్చ్ చేశారు. కానీ ఇంకా ఎవరికీ దొరకలేదు. కానీ మహాత్ముడి సాధారణ జీవితం ఓ సందేశంగా మారింది. ఇదే మహాత్ముడిని అనుసరించేలా చూస్తోంది. భారత దేశంలో జన్మించిన గాంధీ ఆ తర్వాత మహనీయుడిగా మారుతాడని ఆయన కూడా కలలో అనుకుని ఉండరు.
Mahatma Gandhi Comment Viral Today
నా జీవితమే నా సందేశం ఈ ఒక్కటి ప్రపంచాన్ని విస్తు పోయేలా చేసింది. బారిస్టర్ గా మొదలై అవమానాలు భరించి చివరకు జాతికి దిశా నిర్దేశం చేసే స్థాయికి చేరుకున్న ప్రయాణం ప్రతి ఒక్కరూ తెలుసు కోవాల్సిందే. గాంధీ ఒక వ్యక్తి కాదు శక్తి..ఒక సమూహానికో లేదా ఒక ప్రాంతానికో లేదా ఒక దేశానికి మాత్రమే పరిమితమైన మానవుడు కాదు. గాంధీ(Mahatma Gandhi) ఈ సమస్త మానవాళికి ఆదర్శ ప్రాయుడైన మహనీయుడు. వ్యక్తిత్వం అన్నది ప్రతి వ్యక్తికి, సమాజానికి అత్యంత అవసరమని దానిని కాపాడుకోలేక పోతే దేనినీ సాధించ లేమని సందేశం ఇచ్చారు.
దేశ విముక్తి కోసం గాంధీ చేసిన పోరాటం గురించి ఎంత చెప్పినా తక్కువే. కాల గమనంలో సత్యం, ధర్మం, శాంతి మాత్రమే సమస్త సమాజానికి అవసరమని నొక్కి చెప్పారు. లేక పోతే ఈ విశ్వం అల్లకల్లోలంగా మారుతుందని సుతిమెత్తగా హెచ్చరించారు. సత్య శోధన ఒక బైబిల్ గా భావిస్తారు చాలా మంది. ఈ భూమి మీద ఇలాంటి మానవుడు ఒకరు నడిచారని రాబోయే ప్రపంచం కచ్చితంగా విస్తు పోతుందని ప్రముఖ శాస్త్రవేత్త ఐన్ స్టీన్ అన్నారంటే అర్థం చేసుకోవచ్చు గాంధీ ఎంతగా మరిచి పోలేకుండా చేశారో.
నా జాతి వివక్షకు లోనవుతోంది. అంతకు మించి హింసకు బలవుతోంది. కానీ నేను మాత్రం ఒంటరిగా నిల్చున్న సమయంలో నాకు ఒక్కటే వెలుగు కనిపించింది. అది నన్ను అత్యంత శక్తిమంతుడిగా మార్చేలా చేసింది. ఆ ప్రకాశవంతమైన శక్తి ఎవరో కాదు జాతిపిత మహాత్మా గాంధీ(Mahatma Gandhi) అన్నాడు ప్రముఖ హక్కుల నాయకుడు మార్టిన్ లూథర్ కింగ్. ఆయనే కాదు ఏళ్ల కొద్దీ నిర్బంధంలోనే గడిపిన నల్ల సూరీడు నెల్సన్ మండేలా మాటల్లో నాకు మార్గం చూపింది , శక్తివంతమైన అహింస అనే ఆయుధాన్ని ఇచ్చింది ఒకే ఒకరు అతడే మహాత్ముడు అని ప్రకటించాడు.
యావత్ ప్రపంచం శాంతినే తన జీవన గమనంగా మార్చుకున్న గాంధీకి సలాం చేసింది. అసమానతలు ఉన్నంత కాలం, మనుషుల మధ్య కులం , మతం అనే మౌఢ్యం చెలరేగుతున్నంత కాలం గాంధీ లాంటి వ్యక్తులు అవసరం అవుతారు. ఎక్కడ చూసినా హింసోన్మాదం పేట్రేగి పోతోంది. దానిని అడ్డుకట్టే వేయాలంటే ఆయుధాలు లేని అహింస ఒక్కటే మార్గం. ఏది ఏమైనా మహాత్ముడు ఎల్లప్పటికీ మన మధ్య ఉంటారు. విరాజిల్లుతూనే మనలో ప్రవహిస్తూనే ఉంటాడు. గాంధీకి మరణం లేదు. జాతిపితకు చావు లేదు.
Also Read : Posani krishna Murali : అత్తా కోడళ్లపై పోసాని ఫైర్