CM KCR : 6 నుంచి తెలంగాణ‌లో అల్పాహారం

రంగారెడ్డి జిల్లాలో ప్రారంభించ‌నున్న సీఎం

CM KCR : తెలంగాణ – రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. విద్యా, వైద్య రంగాల‌పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతున్నారు. తాజాగా మ‌రో అద్భుత‌మైన ప‌థ‌కానికి శ్రీ‌కారం చుట్టారు. పేద పిల్ల‌లు , విద్యార్థులు ఎక్కువ‌గా ప్ర‌భుత్వ బ‌డుల్లో చ‌దువుకునేందుకు వ‌స్తారు. ఇందుకు గాను వారి ఆక‌లి తీర్చేందుకు అల్ప‌హారం ప్రారంభించాల‌ని తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారిని ఆదేశించారు సీఎం కేసీఆర్.

CM KCR Sensational Decision

ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కు అప్ప‌హారం ఈనెల 6 నుంచి ప్రారంభించాల‌ని స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు జారీ చేసిన ఉత్త‌ర్వుల‌లో పేర్కొన్నారు సీఎస్. ఇదిలా ఉండ‌గా అల్ప‌హారం కార్య‌క్ర‌మాన్ని తొలుత ఈనెల 6న రంగారెడ్డి జిల్లా నుంచి సీఎం కేసీఆర్(CM KCR) ప్రారంభించ‌నున్నారు.

దీంతో ఆరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్ర‌భుత్వ బ‌డుల్లో సీఎం అల్పాహార ప‌థ‌కాన్ని ప్రారంభించాల‌ని సీఎం పేర్కొన్నారు. ఈ సంద‌ర్బంగా సీఎస్ అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ లో మాట్లాడారు. అల్ప‌హారం ప‌థ‌కానికి సంబంధించిన విధి విధానాలు ఇప్ప‌టికే జారీ చేసిన‌ట్లు తెలిపారు.

అంతే కాకుండా 14 వ‌ర‌కు రాష్ట్ర‌మంత‌టా 85 ల‌క్ష‌ల బ‌తుకమ్మ చీర‌ల‌ను పంపిణీ చేయాల‌ని స్ప‌ష్టం చేశారు సీఎస్. అంతే కాకుండా యువ‌త‌కు 18 వేల స్పోర్ట్స్ కిట్స్ అంద‌జేయాల‌ని అన్నారు శాంతి కుమారి.

Also Read : Perni Nani : బెయిల్ క‌ష్టం జైలు శాశ్వ‌తం

Leave A Reply

Your Email Id will not be published!