Tirumala Navaratri : 15 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
ప్రకటించిన తిరుమల తిరుపతి దేవస్థానం
Tirumala Navaratri : తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ 15 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు షెడ్యూల్ డిక్లేర్ చేసింది. ఈ ఉత్సవాలు అక్టోబర్ 23 వరకు కొనసాగుతాయని పేర్కొంది.
నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రారంభం నుంచి ముగింపు దాకా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది టీటీడీ(TTD). ఉత్సవాలలో అష్టాదళ పాద పద్మారాధన, తిరుప్పావడ, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేసినట్లు టీటీడీ స్పష్టం చేసింది.
Tirumala Navaratri Brahmotsavams
ఇదిలా ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్జిత బ్రహ్మోత్సవ సేవ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు తీపి కబురు చెప్పింది. వీరిని వాహన సేవకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపింది.
ఉత్సవాలను పురస్కరించుకుని 15న రాత్రి 7 నుండి 9 వరకు పెద్ద శేష వాహనంపై శ్రీవారి ఊరేగిస్తారని టీటీడీ పేర్కొంది. 23న శ్రీవారి చక్ర స్నానంతో ఉత్సవాలు ముగుస్తాయని తెలిపింది.
Also Read : Meta Lay Offs : మెటాలో కొలువుల కోత