BRS Manifesto : తెలంగాణ – రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు సంచలన ప్రకటన చేశారు. బుధవారం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న తరుణంలో అక్టోబర్ 16న వరంగల్ వేదికగా నభూతో నభవిష్యత్ అన్న రీతిలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు.
BRS Manifesto Viral
ఈ సందర్భంగా బీఆర్ఎస్(BRS) పార్టీ చీఫ్, ప్రస్తుత తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో తయారు చేసిన మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ మేనిఫెస్టో ప్రతిపక్షాలకు భిన్నంగా ఉంటుందన్నారు. తాము గతంలో చెప్పిన హామీలను తూచ తప్పకుండా అమలు చేయడం జరిగిందన్నారు హరీశ్ రావు.
అన్ని వర్గాల ప్రజలకు, రైతులకు, యువతకు, మహిళలకు, ఉద్యోగులకు, కర్షక, కార్మికులకు, సంబండ వర్గాల వారందరికీ మేలు చేకూర్చేలా అద్భుతంగా ఉంటుందన్నారు మేని ఫెస్టో. దీనిని చూసి ప్రతిపక్షాలు తమ పార్టీని ద్వేషిస్తున్న వారు, విమర్శలు గుప్పిస్తున్న వారంతా విస్తు పోయేలా ఉంటుందని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు తన్నీరు హరీశ్ రావు.
ఆరోజు అశేష జన వాహిని సాక్షిగా కేసీఆర్ మేని ఫెస్టోను విడుదల చేయనున్నారని ప్రతిఒక్కరు హాజరు కావాలని పిలుపునిచ్చారు.
Also Read : RK Roja Selvamani : మంత్రి రోజా కంటతడి
